అబధం తెచ్చిన అపమానం – నీతి కథలు Short Moral Story
అనగనగా ఒక ఊరిలో రంగారావు అనే ఒక అసామీ ఉండేవాడు. ఆయనకు ఒకసారి బాగా జబ్బు చేసేంది. తన కుమారుడైన రాముని పిలిచి,
“జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని నాకు (ప్రమాణం చెయ్యి” అని అడిగాడు. అందుకు సరేనని చెప్పి, తండ్రి చేతిలో చెయ్యి. వేసి (ప్రమాణం చేశాడు రాము.
ఒకరోజు రాము అడవి కథ కమార్గాన పట్టణానికి వెళుతూండగా దొపిడీ దొంగలు అతడిని చుట్టు
ముట్టారు. వారిలో ఒకడు “నీ దగ్గరేం ఉన్నాయి?” అని అడిగాడు.
“నా. దగ్గర యాభై రూపాయలున్నాయి అని చెప్పాడు రాము. దొంగలు అతని జేబులు వెతికారు.
కానీ ఏమీ దొరలేదు.
వాళ్లు మారు మాట్లాడ కుండా మె్లీపోబోతుంటే, వెనక్కి పిలిచి, “నా దగ్గర నిజంగానే యాఖై రూపాయలు ఉన్నాయి.
ఆ నోటుని నేను నా చొక్కా జేబులో రహస్యంగా దాచాను. అది మీకు కనపడలేదు. ఇదిగో తీసుకోండి” అంటూ యాఖై రూపాయల నోటు వారి చేతికి ఇవ్వ బోయాడు.
ఆ దొంగలముఠా నాయకుడు, రాము నిజాయితీకి సంతోషపడి, అతడిని మెచ్చు కున్నాడు. అంలేకాదు వందరూపాయలు బహుమానం కూడా ఇచ్చి వెళ్లిపోయాడు.
తన తండ్రి నిజం చెప్పమని ఎందుకు చెప్పాడో రాముకి అర్థం అయ్యింది. నిజం చెప్పినవారికి అన్నిటా విజయం లభిస్తుంది.