కుక్క – నక్క నీతి కథలు Short Moral Story
అడవిలో ఉండే నక్క ఒకటి ఒకనారు దారితప్పి ఊళ్లోకి వచ్చేసేంది. అది తోవ వెంబడి వెళ తుండగా ఒక కుక్క దానికి ఎదురువచ్చింది.
నక్క ఆ కుక్కను అశ్చర్యంగా చూస్తూ గనీ మెడలో ఆ గొలుసు, ఆ బిళ్ల ఏమిటి?” అని (ప్రశ్నించింది.
“ఓహ్! అదా! నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు. వీధికుక్కలతో పాటు నన్ను పట్టుకువెళ్లి కాల్చివేయకుండా ఉండటా నికి ఈ బిళ్లను నా మెడలో కట్టాడు” అని కుక్క చెప్పింది.
“ఆశ్చర్యంగా ఉందే’ అంది నక్క. నీవు అడ విలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే. మా యజమాని ఛాలా మంబివాడు.
నన్ను తన ఇంట్లో పెట్టుకుని పెంచుకుంటున్నాడు. నాకు మంచి మంచి రొట్టెలు, మాంసం, పాలు అన్నీ పెడతాడు.
రోజూ వేడినీళ్లతో స్నానం చేయిస్తాడు. నాకు తినడానికి హ్లాం, పాలు తాగడానికి గిన్నె ఉన్నాయి. అంతేకాదు, పడుకోవడానికి కూడా ఉంది అంది కుక్క గర్యంగా.
“అలాగా” అంది నక్క ఈర్ష్యగా. “అంతేకాదు మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి.
జాతివైరం మరబి మేమంతా సరదాగా ఆడుకుంటాం” అని చెప్పింది కుక్క. “మి(త్రనూ! ఈ రోజు నుంబి మనమిద్దరం స్నేహితులం.
నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ల” అంది నక్క. సరేనని కుక్క నక్కను తన ఇంటికి తీసుకువెళ్లింది.
యజమాని చూస్తే కొడతాడని నక్కను పెరట్లో చెట్టుచాటున దావి తన రొట్టెలు, మాంసం దానికి పెట్టసాగింది కుక్క.
కుక్క తనకు చేసే అతిధిమర్యాదలకు సంతోషించాల్సిందిపోయి అడవిలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంటే ఈ కుక్కకు ఇన్ని సౌకర్యాలు,
ఇంత వైభోగమా అని అసూయ చెందింది నక్క. “నీవొచ్చి చాలా రోజులైంది. నా యజ మాని చూస్తే నిన్ను చంపేస్తాడు వెళ్లీపో” అంది కుక్క. “మి(త్రమా! నిన్ను వదిలివెళ్లాలని లేదు.
ఇంకొక్కరోజు ఉండి వోతాను” అంది నక్క. మరుసటిరోజు అందరూ నిద్ర పోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లలను చంపి తిని, ఎముకలు పడేసి వెళ్లిపోయింది.
నమ్మకంగా ఉంటూ కుక్క ఇంతపని చేసింద నుకున్న యజమాని కుక్కను చితక్కొట్టి ఇంటినుంబి తరిమేశాడు.
నీతి: దుర్మార్గులతో స్నేహం ప్రమాదకరం.