కోతి తిప్పలు Telugu Neethi kathalu
అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. అడవిలోని జంతువులనుచంపి తిని ఆకలి తీర్చుకునేది.
ఒక్కోసారి మాత్రం ఎంత వెదికినా దానికి ఆహారం దొరికేది కాదు. అటువంటప్పుడు అది రాత్రిపూట అందరూ ని(ద్ర పోయే సమయంలో
అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్లి మేకలను చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది. తోడేలు చేసే పనుల్ని అడవిలో ఉండే
ఒక కోతి చాలా కుతూహలంగా గమనించింది. ఆ విషయం తెలుసు కున్న తోడేలు చాలా తెలివిగా తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పగా చెప్తుండేది.
యజమాను లకు తెలియకుండా మేకలను ఎలా చంపుతోందో కోతికి వర్ణించి చ్రస్టేది. ఆ వాటలు విన్న కోతికి తోడెలు ఊరివ్వాళ్ల కళ్లు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటోందో చూడా లనిపించేది.
ఒకరోజు కోతి “నువ్వు ఆ (గ్రామానికి హ్లోటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా? నీ పనితనం చూడాలనుంది” అని తోడేలును అడిగింది.
అప్పుడు తోడేలు “ఈ రోజు రాత్రికే నిన్ను తీసుకెడతాను. | రాత్రికి సిద్ధంగా ఉండు అని చెప్పింది. తన ముచ్చట తీరబోతు ‘.
న్నందుకు కోతి చాలా మురిసి | పోయింది. తమ ఊరిలో అప్పుడ ప్పుడు మేకలు మాయం అవుతుండటం ఊరివారు గమనించారు.
ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలను కాపలా కాయసాగారు. ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేించింది.
మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్లటాన్ని ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి
అర్ధం అయింది. వెంటనే తోడేలుపై కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు.
ఆదెబ్బలకు తట్టుకోలేక కోతి, “మీ మేకల్ని తినటానికి వచ్చింది తోడేలు, నేను కాదు కదా! నన్నెందుకు కొడుతున్నారు?
వదిలేయండి” అని అడిగింది. “తోడేలుకి నహాయంగా వచ్చావు. నిన్ను మాత్రం ఎలా విడిచి
పెడతాం!” అంటూ కొట్టసాగారు.
ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడ నుంచి తప్పించుకొని “బతుకు జీవుడా’ అనుకుంటూ అడవికి చేరుకుంది.
ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయళూడద నుకుని లెంపలు వేసుకుంది. అప్పటి నుంచి అటువంటి పనులకు దూరంగా ఉండసాగింది.
నీతి : చెడు చేయకపోయినా చెడు చేసే వారి వక్కన ఉంటే ప్రమాదాలు తప్పవు.