పిల్ల కాకి – నీతి కథలు Telugu Moral Stories

 పిల్ల కాకి – నీతి కథలు 


ఒక అడవిలో చెట్టు మీద ఒక కాకి ఉండేది. ఒకరోజు పెద్ద గాలివాన రావ టంతో కాకిగూడు కూలిపోయింది. 

దానితో కాకి పెట్టిన గుడ్లన్నీ కిందపడి పగిలిపోయి ఒక గుడ్డు మా(త్రమే మిగిలింది. ఒక్కగానొక్క పీల్ల మాత్రమే మిగల డంతో తల్లికాకి దానిని గారాబంగా పెంచసాగింది. 

పేల్లకాకికీ ఎగిరే వయసు వచ్చిన తర్వాత కూడా బయటకు వో సీయకుండా తనే ఆహారం తెచ్చి నోటికి అందించేది. 

ఇలా ఉండగా ఒకరోజు తల్లికాకి రెక్కకు దెబ్బ తగిలింది. దాంతో సరిగా ఎగరలేక ఆహారం కోసం బయటకు వెళ్లలేకపోయింది. 

పిల్లకాకిని పిలిచి బయటకు వెళ్లి ఆహారం తీసుకుని రమ్మని చెప్పింది. అంతవరకు ఎప్పుడూ గూడు విడిబిపెట్టని పిల్లకాకి ‘ బయటకు ఎలా వెళ్లాలో తెలియదు’ అన్నది.

దాంతో తల్లి కాకి అవన్థపడి బయటకు వెళ్లి ఆహారం తీసుకు వచ్చింది. పక్కచెట్టు మీద ఉన్న కాకి ఇదంతా గమనించి, తల్లికాకి దగ్గరకు వచ్చి, 

నువ్వ చేసిన అతి శ | గారాబం వలనే నీ కు | కీల అలా తయార లు య్యింది. దాని శీరు [గ్‌ త మార్చే ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో చాలా కష్టం” అని మందలించింది.
అప్పుడు తల్లికాకి “నాకు ఇప్పుడిప్పుడే ఆ విషయం అర్ధమవుతోంది. నా పిల్లను మార్చటానికి నువ్వే ఏదయినా సలహా చెప్పగలవా?” అని అడిగింది. 

పక్కచెట్టు మీది కాకి నరే అంది. ఆ కాకీ తన పిల్లల్ని పిలిబి “ఈ రోజు నేనే ఆహారం తెచ్చి పెడతాను, మీరు గూట్లోనే ఉండండి అని పిల్లకాకికి వినిపించేలా గట్టిగా అంది. 

మాకు రెక్కలు లేనప్పుడు నువ్వ ఆహారం తెచ్చి పెట్టావు. ఇప్పుడు వాకు రెక్కలు ఉన్నాయి కదా! ఆహారం తెచ్చు కోకుండా ఉండటానికి మేము పనిచేతకాని సోమరులం కాదు. 

బయటకు వెళితీ సంతోషంగా ఉంటుంది. ఆహారంతో పాటు లోకంలో అనేక వింతలు కూడా కనిపిస్తాయి” అన్నాయి ఆ పీల్లకాకులు.
ఎప్పుడూ బయటకు వ్లోని పిల్లకూకికి ఈ మాటలు విన్నాక బయటక వెళ్లాలనే ఉత్సాహం కలిగింది. 

మిగిలిన కాకులతో పాటు ఎగురుతూ బయటకు వెళ్లింది. ఎన్నో ఆంద మైన దృశ్యాలను చూసింది. 

దాని ఆహారం అది సొంతంగా సంపాదించుకుంది. ఇలా బయటక రావటం వలన దానిలో ఉత్సాహం కలిగింది. 

అంతేకాక సంతృప్తిగా అనిపించింది. ఇక అప్పటి నుంచి ప్రతిరోజూ తల్లి కంటే ముందుగానే ఆహా రానికి బయలుదేరటం (ప్రారంభించింది. 

తన పిల్లలో వచ్చిన మార్చుకి తల్లికాకి ఎంతో సంతోషించింది. పక్కచెట్టు కాకికి కృతజ్ఞతలు తెలుపుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *