బద్దకపు మల్లయ్య- నీత్ కథలు Telugu Short moral story

0

బద్దకపు మల్లయ్య– నీత్ కథలు 

Telugu Short moral story

అనగనగా ఒక ఊరిలో మల్లయ్య అనే యువకుడు ఉండేవాడు. అతడు చాలా బద్దకస్తుడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఏ పని చేయటానికీ ఇష్ట పడే వాడు కాదు. 

అలా ఎప్పుడూ ఖాలీగా ఉండటంతో మల్లయ్యను ఊరి లోని వారంతా సోమరిపోళు అని ఎగతాళి చేసేవారు. 

ఈ మాటలు తల్లిదం (త్రుల చెవిన పడ్డాయి. వారు చాలా బాధపడ్డారు. ఎలాగ్జి నామల్లయ్యను 
ఏదో ఒక పనిలో పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.
ఒకరోజు వల్లయ్యను పిలిచి “నువ్వ పని చేయకుండా ఇలా ఎంత కాలం ఉంటావు? మేము ఉన్నంత కాలం ఏదో విధంగా నిన్ను పోషిస్తాం. మేము పెద్దవాళ్లు. 

వయసు మీద పడుతోంది. కొంతకాలానికి మేము చని పోక తప్పదు. ఆ తర్వాత నువ్వ ఎలా బళుకుతావు? ప్రతి మనిషీ బతక టానికి ఎదో ఒక పని చేసుకోవాలి. 

లేకపోతే బతకలేరు. నువ్వ కూడా ఏదో ఒక పని చేసుకో అని నచ్చచెప్పారు. తల్లిదండ్రుల ఒత్తిడితో మల్లయ్య సరే మీరే చెప్పండి ఏం పని చేయాలో అని అడిగాడు. 

“అడవికి వ్స్లీ కట్టెలు తీసుకురా అని చెప్పారు అతడి తల్లిదండ్రులు. మల్లయ్య ఒక రోజు ఉదయాన్నే లేబి కట్టెల కోసం అడవికి వెళ్లాడు. 

కొంతసేపు అడవిలో అటూ ఇటూ తిరిగాడు. పని అలవాటు లేని మల్ల య్యక కట్టెలను ఎలా కొట్టాలో తెలియలేదు. 

ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచించసాగాడు. చల్లటి గాలికి అతడికి నిద్ర ముంచుకు వచ్చింది. అక్కడే పడుకున్నాడు. 

కొంతసేపటికి అతడు ఉన్న చోట చెట్టు నీడ పోయి ఎండ వచ్చింది. కానీ మల్లయ్య ఉన్న చోటనే ఉండిపోయాడు. 

ఎండ వప్పి మీద పడుతున్నా కూడా అక్కడ నుంచి కదలకుండా బద్దకంగా ఉండిపోయి ఎండను తెబ్బిన సూర్యుడే తిరిగి నీడను ఇవ్య్వకపోతాడా? 

అనుకుంటూ ఎదురు చూరు. కొంతసేపటికి ఒక సింహం తన వైపునకు రావడాన్ని
గమనించాడు మల్లయ్య. కానీ అప్పుడు కూడా లేవలేదు ఆ
బద్దకస్తుడు. “కఇింహం నా మీదకు ఎందుకొస్తుంది, పక్క
నుంబి పోతుందిలే అనుకుంటూ అలాగే ఉండిపోయాడు.
అప్పుడే అటువైపుగా వస్తున్న వేటగాడు… మల్లయ్య మీదకు
సింహం రావడాన్ని గమనించాడు. వెంటనే తన వద్దనున్న తుపాకీతో గాలి లోకి కాల్చి సింహాన్ని పారిపోయేటట్లు చేసి మల్లయ్యను సింహం బారి నుంబి కాపొడాడు. 

బుద్ధి తెచ్చుకున్న మల్లయ్య “ఇంకప్పుడూ బద్దకాన్ని దరిచేరసీయకూడదు’ అనుకుని ఆఅ వేటగాడికి కృతజ్ఞతలు తెలిపాడు. 

అలాగే కట్టెలను ఎలా కొట్టాలని అతడినే అడిగి తెలుసుకుని, అడవి నుంచి కట్టెలు తీనుకుని ఇంటి౭ళ్లాడు. 

జరిగింది తల్లిదండ్రులకు చెప్పి తాను ఇక నుంబి అందరిలాగే పని చేసుకుంటానని చెప్పాడు. మల్లయ్యలో వచ్చిన మార్పుకు తల్లిదం[క్రులు సంతోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here