మంచి వారి స్నేహం – తెలుగు నీతి కథలు
ఒక కాలువ ఒడ్డున ఒక చీమల పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఎన్నో చీమలు నివాసం ఉండేవి. దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు ప్రతిరోజూ ఒక పాపురం వచ్చేది. చీమలు ఆ పావురంతో స్నేహం చేయడం మొదలు పెట్లాయి.
ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ సంవత్సరం వర్షాలు బాగా కరి శాయి. చెరువులు, నదులు పొంగి పొర్ట సాగాయి. చీవలి పుట్ట దగ్గరలో ఉన్న కాలువ నిండా నీళ్ళ వచ్చాయి. వర్జాలు ఇంకా తగ్గలేదు. రోజురోజుకీ
కాలువ నీటి మట్టం పెరిగిపోసాగింది. ఇలాగే సాగితే తమ పుట్ట నీళ్ళల్లో మునిగిపోయి, తామంతా చచ్చి పోతామని భయపడసాగాయి చీమలు.
ఆరోజు మామూలుగా అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండటం చూసి… “ఏమైంది మిత్రులారా? రోజులా ఆడుతూ పాడుతూ నంతోషంగా లేరు.
ఏం జరిగింది? ఎందుకలా విచారంగా ఉన్నారు?” అని అడిగింది. “ఏం చెప్పమంటావు నేస్తం, మేము ఈ (ప్రపంచంలో అన్నిటికన్నా అల్పులమైన (పాణులం.
గాలి వీబినా, ఎండ కాసీనా, వాన కురిసినా మాక అన్నీ కష్టాలే. ఈ కాలువ నిండి నీళ్ళ బైటకి పారితే వాకు ప్రమాదం.
మా నివాసం ఆ నీళ్ళలో కరిగిపోయి మేమంతా చచ్చి పోతాం. ఆ ఉపద్రవం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది” అని తమ గోడును వెళ్ళబోసుకున్నాయి.
“మరి ఇక్కడి నుంబి దూరంగా వెళ్ళిపోతీ మంచిది కదా!” అంది పావ్సరం. “ఎక్కడకని వెళ్తాం, ఎలా వెళ్తాం? పూ బంధువులు ఆ కాలువ అవతల ఉన్నారు.
కాని అక్కడికి చేరువకోవడం మా తరమా?” అంటూ దిగులుపడ్డాయి. ఆ మరునాడు పావురం అక్కడికి వచ్చేసరికి చీమలు భయ పడుతున్నట్టే నీళ్ళలో పుట్ట మునిగిపోయి ఉంది.
చీమలు ఆ పక్కనే ఉన్న ఆకులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నాయి. నెంటనే పావురానికి ఒక ఉపాయం తట్టింది.
“బెంతించకండి. నేను మిమ్మల్ని అవతలి ఒడ్డుకు చేరుస్తాను. మీరంతా త్వరగా వన్చి నా వీపు మీద ఎక్కండి” అంటూ పావురం పుట్టకు దగ్గరలో నేల మీద కూర్చుంది.
చీమలు పావురం మీదకు ఎక్కి కూర్చున్నాయి. పావురం నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఎగురుతూ కాలువకు అవతలి వైపుకు వెళ్ళింది.
దూరంగా ఎక్కడో ఉన్న చీమల బంధువులను వెతికి మరీ వాటిని అక్కడికి చేర్చింది పావురం. పావురం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి చీమలు.
నీతి; మంచివారితో స్నేహం ఆపదల నుంచి రక్షిస్తుంది.