సాహసం -fairy tales stories in telugu
వీరయ్య అనే వ్యాపారి ఒక రోజు బావి దగ్గర హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. మాటిమాటికి బావిలోకి తొంగిచూస్తున్నాడు.
అతనికి దిక్కుతోచడం లేదు. రెండు రోజులుగా అంగడికి కూడా వెళ్లడం లేదు. ఇట్లా అయితే ఎట్లా? అని ఆలోచిస్తున్నాడు.
అంతలో అటుగా వెళుతున్న భీమయ్య అనే కూలి పని చేసుకునే వ్యక్తిని పిలిచి “నీకు వందరూపాయలు ఇస్తాను.
బావిలో నీళ్లు తోడి పక్కనే ఉన్న బానలో పోస్తావా?” అని అడిగాడు. భీమయ్య సరేనని బావిలో నీళ్లు చేదతో తోడి పక్కనే ఉన్న పెద్దబానలో పోయడం ప్రారంభించాడు.
ఎంతసేపు, నీళ్లు తోడిపోసినా బాన నిండటం లేదు. ఏమైంది అని పరిశీలించి చూడగా బానకు పెద్ద పెద్ద చిల్లులు ఉన్నాయి.
చిల్లులో నుండి నీళ్లు తోటలో చెట్లకు వెళ్లిపోతున్నాయి. దాంతో భీమయ్యకు కోపం. వచ్చి “చిల్లు: పడిన బాన నింపమంటున్నావు.
నీకు నేను వెర్రివాడిలా కనబడుతున్నానా?” అని తిట్టి పనివదిలేసి వెళ్లిపోయాడు.
ఈసారి. వీరయ్య రామయ్య. అనే మరో వక్రిని పిలిచి బావిలో నీళ్లు తోడి బానలో పోస్తే
వందరూపాయలు ఇస్తానన్నాడు.
రామయ్య నీళ్లు తోడి బానలో పోయసాగాడు. ఎన్ని, నీళ్లు పోసిన బాన నిండటం లేదు; చిల్లు నుంచి చెట్లకు నీళ్లు వెళ్లిపోతున్నాయి.
ఆ. విషయం గమనించి కూడా రామయ్య యజమాని వద్దనే వరకూ నీళ్ళు తోడుతూ ఉంటే సరిపోతుందనుకున్నాడు.
వందరూపాయలు. వస్తాయి కదా అనుకుని ఆపకుండా. నీళ్లు తోడసాగాడు. మధ్యాహ్నానికి బావిలో నీళ్లన్నీ అయిపోయి, మట్టి కనబడసాగింది.
ఆ మట్టిలో దగధగలాడిపోతున్న చంద్రహారం బయటపడింది. “పొరపాటున బావిలో చంద్రహారం పడిపోయింది.
దీని కోసమే నీళ్లు తోడమన్నాను” అని వీరయ్య సంతోషించి రామయ్యకు రెండువందల రూపాయలు. ఇచ్చాడు.
ఈ కథలోని అసలు విషయం ఇదే! ఎవరికైనా సహనంతోనే మంచి జరుగుతుంది.