గాలిమేడలు | Akbar and Birbal Short Stories in Telugu

గాలిమేడలు

Akbar and Birbal Short Stories in Telugu

Akbar and Birbal Short Stories in Telugu: ఒకరోజున అక్బర్, బీర్బల్ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ మాటలలో గాలిమేడల ప్రసక్తి వచ్చింది. “బీర్బల్! గాలిమేడలు అంటుంటారు. అవి ఎలా ఉంటాయి.

వాటిని కట్టడానికి ఎంత ఖర్చవుతుంది” అని ప్రశ్నించేడు. అక్బరాదుషా! “జహాపనా! గాలిమేడలు కట్టడం అందరికి సాధ్యపడే పనికాదు. కొందరికీ గాలిమేడలు కట్టడంలో ప్రావీణ్యత ఉంటుంది.

సర్వసాధారణంగా గాలిమేడలు కట్టేవారిని గుర్తించడం కూడా కష్టం” అన్నాడు బీర్బల్. ఆ మాటలకు అక్బరాదుషా తనకు గాలిమేడలు చూడాలని ఉన్నదని.

పనివారిని రప్పించి కట్టించవలసినదని, ఖర్చుకు వెనకాడవద్దని ఆదేశించేడు. సరే పాదుషావారి ఆజ్ఞమేరకు గాలిమేడలు కట్టించుతాను. వాటికి పునాదులు గోడలు ఉండవు.

ఎన్ని అంతస్తులైనా కట్టవచ్చు. ఎన్ని అంతస్తులు కట్టించనుఁ అన్ని అంతస్తులు కట్టగలవారిని రప్పించి మేడలు ఆరుమాసాల్లో కట్టిస్తానన్నాడు.

ఆ తర్వాత బీర్బల్ పాదుషావారి దర్శనానికి రావడం మానివేశాడు. బీర్బల్ రాకపోవడంతో అక్బరుకు కాలక్షేపం జరగక కబురుచేసారు. పనివాళ్ళకోసం తిరుగుతున్నాను.

వారు దొరకగానే మీ దర్శనానికి గాలిమేడలతో పాటు వస్తానని సమాధానం పంపించేడు. అనుకున్న ప్రకారం ఆర్నెల్ల కాలంగడచిపోగా బీర్బల్ ఒకనాడు పాదుషా వారి సన్నిధికి. ఒకవ్యక్తిని తీసుకొని వచ్చేడు.

ఏమయ్య బీర్బల్! గాలిమేడల నిర్మాణం ఎంతవరకు వచ్చింది”. అని ప్రశ్నించాడు అక్బరాదుషా! ప్రభువులవారు సావధానంగా ఉంటే గాలిమేడల దర్శనం జరుగుతుంది.

ఇతడే గాలిమేడలు నిర్మాణంలో ఎంతో ప్రవీణుడు. నా వద్దకు వచ్చిన ఇతడు మీ దర్శనమును కోరి యున్నందున మీ తావునకు తీసుకువచ్చాను. కొద్ది క్షణాలు మీరితనితో మాట్లాడినచో వీనికి గల ప్రావీణ్యత అవగతమౌతుంది”. అన్నాడు బీర్బల్.

“నువ్వు చాలా ప్రవీణుడవని బీర్బల్ చెబుతున్నాడు. నీది యే ఊరు? నీ తల్లితండ్రులెవరు? నువ్వేం చేస్తుంటావు?” అని అక్బర్ ఆ వ్యక్తిని ప్రశ్నించాడు. “జహాపనా! ఏమని చెప్పను.

చాలా చరిత్రగలిగిన సమర్ధుడను. నా తల్లిదండ్రులు వాళ్ళు కాబట్టి నన్ను పెంచగలిగేరు. మా స్వగ్రామమైన బర్కల నగరుకు తరచుగా పహిల్వానులు వచ్చేవారు.

వారితో పసితనంలోనే కుస్తీలు పట్టేవాడ్ని. నాపేరు చెబితే మల్లయోధులు మాఊరువచ్చేవారేగాడు. ఇరుగుపొరుగు రాజులు | నాకీర్తివిని నన్ను తమవద్దకు పిలిపించుకొని, కానుకలు నేను మోయలేనంతగా ఇచ్చేవారు.

ఆ కానుకలతో నేనే నా తల్లితండ్రులను పెంచేవాడ్ని. ఒక్క మల్లవిద్యతోనే గాక ఇంకా అనేక విద్యలలో పేరుకీర్తులందుకున్నాను.

తమవంటి ప్రభువులను ఆశ్రయించి, వారికి రక్షకుడిగా, వారి శ్రేయోభిలాషిగా ప్రవర్తించగలచతురుడను. మిమ్మల్ని ఆశ్రయించి ఒక చిన్న జాగీరును సంపాదించి, ఆ జాగీరుకు నా తండ్రిని సుల్తానుని చేసి, వారి అంగరక్షకుడుగా నుండి మరొకటి మరొకటిగా జాగీర్లు సంపాదించుకుని, తమవంటి వారి

స్నేహ సౌశీల్యాదులతో వర్ధిల్లగల సమర్ధత కలిగినవాడను. అంటూ ఇంకాయేమేమొ చెబుతున్న అతనిని బీర్బల్ ఆపుచేశాడు.

విన్నారుకదా ప్రభూ గాలిమేడలు కట్టడంలో ఇతనికి అతనేసాటి. గాలిమేడలకు నివేశనస్దలం – పునాదులు కిటికీలు అక్కరలేదు అన్నాడు. గాలిమేడల నిర్మాణం వివరించడానికే ఈ గాలిమేడల శిల్పిని మీ వద్దకు తీసుకువచ్చేను.

ఆశమీద ఆశ, ప్రగల్బాలమీద ప్రగల్బాలు, పేర్చి రమ్యమైన ఊహలు నిర్మించుకుని వాటిలో ఆకాశపధంలో ఊరేగడం ఈ గాలిమేడలు కట్టేవారిపని. ఆశల పేర్పు – ప్రగల్బాల నేర్పు.

ఊహలల్లుకోవడంలో ఓర్పు ఎదుటివారిని గమనించకుండా పొల్లుమాటలతో వట్టిమాటలతో బ్రతికేవారి పనే గాలిమేడలు కట్టడం జహాపనా! పొల్లు కబుర్లు స్థిరం లేని ఆశలు.

యుక్తాయుక్తాలు తెలియని డాంబికాలే గాలిమేడలు. సమర్ధతను గుర్తెరుగకుండా, సాధ్యాసాధ్యాలను గమనించుకోనట్టి వారి కల్పనా జగత్తులోనివే గాలిమేడలు” అని వివరించాడు బీర్బల్.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment