శిక్ష అమలు తప్పిన తీరు | Akbar and Birbal Small Stories in Telugu

శిక్ష అమలు తప్పిన తీరు

Akbar and Birbal Small Stories in Telugu

Akbar and Birbal Small Stories in Telugu

అక్బరు పాదుషా వారికి భోజనానంతరం తాంబూలం వేసుకోవడం అలవాటుండేది. ఇందు నిమిత్తం పాదుషావారికి ఆకు, సున్నం, వక్క, సుగంధద్రవ్యాలు సమపాళ్ళలో అమర్చిఅందించే నిమిత్తం ఒక నౌకరుండేవాడు.

అతడుకూడా ఎంతో జాగ్రత్తగా తాంబూలాన్ని తయారు చేసి అక్బరువారికి అందిస్తుండేవాడు. అతనికి అంతఃపురంలోని ఒక చెలికత్తె పరిచయమయ్యింది.

వాళ్ళిద్దరు అక్బరువారి అనుమతితో పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకనాడు నౌకరు పాదుషా వారికి తాంబూలం సిద్ధం చేస్తుండగా, అతని ప్రేమికురాలైన అంతఃపురంపరిచారిక అటుగా వెళ్ళడం తటస్థించింది.

ఆమె చిలిపి చూపులు చూస్తూ నౌకరు తమలపాకులకు రాసే సున్నాన్ని గమనించుకోకుండా కాస్త ఎక్కువగా వ్రాసేడు. పాదుషావారికి నోరుపొక్కింది.

సున్నం ఎక్కువరాసిన అశ్రద్ధవల్లనే అలా జరిగిందని తెలుసుకున్న పాదుషా తన కోపాన్ని వెల్లడి కానీయకుండా నౌకర్లు పిడికెడు సున్నం పట్టుకురావలసిందని ఆజ్ఞాపించారు. కారణం ఊహించుకొలేక పోయిన నౌకరు

హుషారుగా వెళ్ళి సున్నంతో తిరిగి వస్తున్నాడు. అలావస్తున్నవాడ్ని బీర్బల్ చూచి అక్బర్ ఆదేశంమేరకు సున్నం పట్టుకువెడుతుండడాన్ని తెలుసుకుని, వానిచే సున్నం తినిపించి శిక్షించడానికి అని గ్రహించుకుని.

సున్నాన్ని పాదుషావారికి ఇస్తావుగాని, ముందుగా వంటశాలకు వెళ్ళి ఒక తవ్వెడు నేతిని త్రాగి పాదుషా వారివద్దకు వెళ్ళమన్నాడు నౌకరును. వాడు అదే ప్రకారం చేసేడు.

అక్బరువారు వాడిని ఆ సున్నమంతా తినవలసినదని శిక్షవిధించాడు. ఆ ప్రకారంగా తిన్న నౌకరు కడుపు గుడ గుడ మంటూ విరోచనమై పోగా సాఫీగా ఉన్నాడు.

తిన్న సున్నం వాడ్నేంచేయకపోవడం గమనించిన అక్బరు బీర్బల్ను ఇలా ఎందుకు జరిగిందని, తాను విధించిన శిక్ష ఎందువల్ల. తప్పిందని ప్రశ్నించాడు.

బీర్బల్ అంతఃపురం పరిచారికను పిలిపించి తాంబూలం అందించే సమయానికి ఆమె అటుగా వెళ్ళడం ఆ సమయంలో తనను చూస్తూ సున్నం వ్రాయడంలో ఎక్కువై ప్రభువులు కోపగించి సున్నం తినిపించడానికి వానిని తీసుకురమ్మనడం.

అది తెస్తుండగా బీర్బల్ గారు చూచి విషయాన్ని ఊహించుకుని సున్నంవల్ల యే ఉపద్రవం జరగకుండా నేతిని త్రాగించడం వగైరా వివరాలను తనకు తెలిసిన మేరకు చెప్పింది.

అంతట బీర్బల్ కలుగజేసుకుని జహాపనా! ఈ తప్పు అతనిధికాదు. అసలుతప్పు. ఆ సమయంలో అతనికి కనిపించి, మనస్సును చంచలపర్చి ఆదమర్చిసున్నం రాసేలా అతడ్ని లోనయ్యేలా, చేసిన తప్పు ఆమెదని.

ఈమెకు విధించవలసిన శిక్ష అతనికి విధించడం వల్ల అది అమలు జరగలేదు. ఈ ఇద్దరికి మీరు తగినట్లు….. శిక్షిస్తే ఇంక ఇటువంటి పొరపాటు జరుగదన్నాడు. అయితే ఆ శిక్షేదో నీవే నిశ్చయించు అన్నాడు అక్బరాదుషా.

వీరిద్దరికీ కళ్యాణంచేసి కట్టివేస్తే. ఇక చిలిపి చేష్టలు చేయకుండ ఉంటారు. అనగా శుభమస్తు అన్నాడు అక్బరుపాదుషా. ఆ దంపతుల వివాహ అనంతరం అక్బరు వారి తాంబూలం మరింత రుచికరమయ్యింది.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment