నిజానికి అబద్దానికి ఉన్న దూరమెంత? | Akbar Birbal Historical Stories in Telugu

నిజానికి అబద్దానికి ఉన్న దూరమెంత?

Akbar Birbal Historical Stories in Telugu

Akbar Birbal Historical Stories in Telugu

ఒకనాడు అక్బరాదుషాకు ఒక అనుమానం కలిగింది. అబద్దం నిజం ఒకదాని వెంబడి ఒకటి అంటిపెట్టుకుని ఉంటాయి కదా.

వీటికి మధ్యగల దూరమెంత? నిజం వెనుక అబద్దం, అబద్దం వెనుక నిజం, మసలుకుంటాయో గాని ఒకటున్నచోట మరొకటి ఉండబోదంటారు అదెంతవరకు నిజం అని అక్బరు బీర్బల్న ప్రశ్నించాడు.

జహాపనా! మీరు చెప్పినది సరైనదే. నిజం వెనుక అబద్దం – అబద్దం వెనుక నిజం ఉండలేదు. ఒకదానితో మరొకటి నిలవలేదు. రెండింటికి అంటే అబద్ధానికి నిజానికి గల మధ్యదూరం కంటికి చెవికి ఉన్నంతదూరం.

ఎందువల్లనంటే చూచింది నిజం, విన్నది అబద్దం. కన్ను – చెవి ఒకచోటకు చేరలేవు. అన్నాడు బీర్బల్. ఆ మాటలకు అక్బరాదుషా ఎంతో సంతృప్తిచెంది బీర్బలు సత్కరించాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment