నక్షత్రాల లెక్క | Akbar Birbal Kathalu in Telugu for Children

నక్షత్రాల లెక్క

Akbar Birbal Kathalu in Telugu for Children

Akbar Birbal Kathalu in Telugu for Children: అక్బర్ ఒకనాడు ఆరుబయటగల తన పాన్పుపై వెల్లకిలా పడుకున్నాడు. ఆకాశంలో గల నక్షత్రాలు మిలమిలలాడుతూ ఆయన హృదయాన్ని పరవశింపచేసేయి. ఈ చక్కని చుక్కలు ఎన్ని ఉంటాయి అన్న ఆలోచన

కలిగింది. ఆలోచించి ఆలోచించి ఆ మర్నాడు దర్బారులో మింటగల చుక్కలు లెక్క చెప్పగలవారికి రత్నాలు, రాసులు బహుమానం ఇస్తామని ప్రకటించాడు.

ఎవరికి ఎంతమాత్రం సాధ్యంగాని ఈ లెక్కకు చాలామంది నిరాశచెందారు. నక్షత్రాల లెక్క చెప్పవలసిన రోజున అద్భుతమైన ఈనక్షత్రాల లెక్క ఎన్నికోట్లో తెలుసుకోవాలన్న ఆసక్తితో అనేకమంది దర్బారుకు చేరుకున్నారు.

బీర్బల్ మాత్రం రాలేదు. అతని రాకకై ఎదురు చూడగా చూడగా కొంతసేపటికి, ఒకమూటను పట్టుకొని దర్బారుకు వచ్చి, మూటను సభామధ్యంలో ఉంచాడు. “ప్రభువులు క్షమించాలి.

నక్షత్రాలు లెక్కపెట్టడం పూర్తయ్యేసరికి ఆలస్యమయింది.” అన్నాడు బీర్బల్. “ఏమిటి? నక్షత్రాలను లెక్కపెట్టావా” అనిఅడిగాడు అక్బరాదుషా.

చిత్తం, లెక్క ఇన్ని అనిచెప్పడం అంకెల్లో సాధ్యపడనందువల్ల నక్షత్రానికొక ఆవగింజవంతున లెక్కపెట్టి ఆ ఆవాలను ఈ సంచిలో వేయించి ఇక్కడకు తెచ్చాను.

గణికులను నియోగించి ఆవాలు లెక్కపెట్టించండి. అవి ఎన్ని ఉంటే అన్ని నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయన్నాడు”. సాధ్యంకాని పనిని అది అసాధ్యమని యుక్తిగా చెప్పిన బీర్బలయుక్తికి, సముచిత ఆలోచనకు ముగ్ధుడైన అక్బర్ – ఆనాటినుండి బీర్బల్ను తన ఆంతరంగిక విదూషకునిగా నియమించాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment