అబద్దంయొక్క బలం | Akbar Birbal Kathalu in Telugu Script

అబద్దంయొక్క బలం

Akbar and Birbal stories, Akbar and Birbal short stories, Akbar and Birbal tales, Akbar Birbal short stories, Akbar Birbal tales, Akbar and Birbal stories in English, Akbar and Birbal stories in Hindi, Akbar Birbal short stories in English, Akbar and Birbal short stories in English, Birbal stories, Birbal tales, Short stories of Akbar and Birbal in Hindi, Small story of Akbar and Birbal in English

Akbar Birbal Kathalu in Telugu Script: ఒకానొకప్పుడు అక్బరుపాదుషా వారి దర్బారునందు రాజకీయ వ్యవహారములు మీమాంసలు – నిర్ణయాలు ముగిసిన తరువాతను – సభలో వినోద ప్రసంగాలు చోటు చేసుకున్నాయి.

క్రమక్రమంగా సభాసదుల ప్రసంగాలు, నిజం అబద్ధం ఏది బలమైనట్టిది అన్న. మీమాంసకు చేరుకున్నది. వాద ప్రతివాదాల అనంతరం నిజమే బలమైనది, స్థిరమైనది అని నిర్ధారణకొచ్చారు.

బీర్బల్ మాత్రం అబద్దమే బలమైనది అని వాదించేడు. – అక్బరుపాదుషావారు నిరూపించమన్నారు. సమయాన్ని అనుమతిస్తే అబద్దం ఎంత బలమైనదో నిరూపిస్తానన్నాడు.

ఆరుమాసాలు గడువిస్తున్నాను. నిరూపించు లేదంటే సభవారి నిర్ణయానికి విరుద్ధంగా నిర్ణయించిన నీకు శిరచ్చేదమై శిక్ష అన్నారు. “చిత్తం” అని అంగీకరించాడు బీర్బల్.

కాలం గడచిపోతున్నది. ప్రజలు, పాదుషావారు ఆ విషయాన్నే మర్చిపోయారు. ఒకనాడు ఒక వృద్ధ వేశ్య మనవరాలితో రాజుగారి దర్శనానికి వచ్చింది. పాదుషావారు నా మనవిని చిత్తగించి, మీ చిత్తాన్ని నేను చెప్పే విషయం మీద మీ

కేంద్రీకరించాలి. మీకు గొప్ప మేలు కలుగుతుంది. ఈ నా మనమరాలు ఇటీవలనే పుష్పవతి అయ్యింది. పేరంటము, ఆశీస్సులు పూర్తయిన నాటి రాత్రి దేవేంద్రుడు నాకు కలలో అగుపించి, హే, హేమాంగీ నీమనువరాలు నాకొరకై పుట్టింది.

నేను ఈ నాటికి 3 నెలల అనంతరం ఆమెను ఏలుకొనుటకు వస్తున్నాను. పాదుషావారి దర్శనం చేసుకుని ఏకాంత మందిరం ఏర్పాటుచెయ్యమని కోరుకుని, నీ మనవరాలిని అందుంచి నా రాకకై నిరీక్షించు.

పరులెవ్వరి ప్రాపకానికి ఆమెను వినియోగించకు. మూడునెలలనాటికి శ్రావణమాసం వస్తున్నది. ఆ మాసంలోని పూర్ణిమరోజు అర్ధరాత్రి ఏకాంతర మందిరానికి నేను వస్తాను.

ఇందుకు యే విధమైన మార్పు ఉండబోదు. అని నన్ను హెచ్చరించాడు. ఆ విషయం తమకు మనవి చేసుకుని ఏకాంతర మందిరం ఏర్పాటు చేయగలందులకు వేడుకుంటున్నాను అన్నది.

ఇంతకుముందెన్నడు యేనాడు జరగని విశేషం ఇది. మానవకాంతను దేవేంద్రుడు ఆశించడం ఆమెకొరకు తాను భువికి ఫలానారోజున వస్తాననడం అబ్బురంగా ఉన్నది.

నిరీక్షిస్తే నిజానిజాలు తెలుస్తాయని పాదుషావారు యోచించి ఆమెకోరిన ప్రకారం ఆమె కుమార్తెకు ఏకాంతరమందిరం కట్టించి, ఆ ఇచ్చిన భవనంలో తన కుమార్తెను ప్రవేశపెట్టి పాదుషావారిని రాజధాని ప్రముఖులను,

శ్రావణశుద్ధ సప్తమీ శనివారంనాడు జరుగబోయె తనకుమార్తె కన్నెరికపు మహోత్సవానికి వచ్చి, దేవేంద్రుల వారి దర్శనం చేసుకుని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసినదని ఆహ్వానించింది.

కాలంగడచింది. శ్రావణ శుద్ధపౌర్ణమి శనివారం అర్ధరాత్రి దేవేంద్ర ఆగమన సందర్శనాభిలాషులై పాదుషా వారు ప్రముఖులు కన్నార్పకుండా నిరీక్షిస్తూన్నారు. దేవేంద్రుడు రావడంగాని, మరేవిధమైన విశేషంగాని జరగలేదు.

అక్బరుకు కోపం వచ్చింది. భటులను పంపించి, నిద్రపోతున్న వేశ్యను ఆమె మనవరాలిని దర్బారుకు రప్పించాడు. ఇంతటి అబద్దమా – మమ్మల్నే మోసగించడమా అని ప్రశ్నించాడు. పాదుషావారు అనుగ్రహించాలి మిమ్మల్ని

మోసగించడానికి నేనీ అబద్దం చెప్పలేదు. అబద్దం యొక్క బలం నిరూపించమని తమరు బీర్బల్ గారిని ఆదేశించారు.

అది ఋజువు చేయడానికే బీర్బల్ గారు చేసిన పన్నాగమిది. అన్నీ తెలిసిన తమరే అబద్దాన్ని నమ్మారు. దాని శక్తికి దాసులయ్యేరు.

మరి నిజం కన్నా అబద్దం బలంకలిగినట్టిదని నిరూపించడమె మాయీ పన్నాగం అని పలికింది. నిజం అబద్ధానికికున్న బలం సామాన్యమైనది కాదు.

అది ఎప్పుడైనా – ఎక్కడయినా – ఎవర్నయినా నమ్మించి విస్తరించగల ‘బలము కలిగినట్టిదన్న సత్యాన్ని గుర్తించి అక్బర్ పాదుషావారు వేశ్యను బీర్బల్ ను సత్కరించారు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment