మసీదులోని లక్షలు నిధి | Akbar Birbal Telugu Short Stories for Kids

మసీదులోని లక్షలు నిధి

Akbar Birbal Telugu Short Stories for Kids

Akbar Birbal Telugu Short Stories for Kids: ఒకనాడొక తల్లికొడుకు పాదుషా వారివద్దకు వచ్చి మసీదును కూలగొట్టి త్రవ్వడానికి అనుమతించవలసినదని కోరుకున్నారు. యేమిటి మీకీ విపరీత కోరిక.

పవిత్రమైన మసీదును కూలగొట్టాలన్న ఆలోచన మీకెందుకు కలిగిందని ఆ తల్లీ కొడుకుల్ని అక్బరాదుషా గద్దిస్తూ అడిగాడు. జహాపనా! ఆ మసీదులో నాలుగులక్షల రొఖాన్ని పాతిపెట్టితిననీ.

దానినితీసుకుని సుఖంగా జీవించవలసిందనీ నా భర్త చనిపోతూ నాకు, నా కుమారునికివ్రాత మూలకంగా తెలియజేసాడని, మరణించిన ఆ వ్యక్తి రాసిన పత్రాన్ని చూపించారు.

పత్రాన్ని బట్టి ఆ నగదును తీసుకోవడానికి అంగీకరించడం ప్రభువుగా తనధర్మమని మహమ్మదీయుల పవిత్ర దేవాలయమైన మసీదును కూల్చేటందుకు

అనుమతించడం నేరమని తటపటాయించాడు. అక్బరుకు యేంచెయ్యడానికి యేమి తోచలేదు. బీర్బల్ను పిలిచి, ఇది చాలా గడ్డుసమస్యగా ఉంది.

నీ బుద్ధిచాతుర్యంతో నువ్వే దీనిని పరిష్కరించాలని అతనిని బీర్బల్క అప్పజెప్పాడు. పరిష్కరించడానికి కొంతవ్యవధిని కోరి, మసీదును పరిశీలించాడు. బీర్బల్.

ఎక్కడా డబ్బును దాచిన దాఖలాలు కనబడలేదు. ఆ తల్లీకొడుకుల వద్దకు వెళ్ళి మృతుడు వ్రాసి ఉంచిన కాగితాన్ని క్షణంగా పరిశీలించాడు.

మసీదులోని నాలుగుశిఖరాలలో రెండు కలిసేచోట డబ్బును నిక్షేపం చేసినట్టుగా అందులో వ్రాయబడి ఉంది. రెండుమీనారులు కలిసేదెలాగునో బీర్బల్కు అంతుచిక్కలేదు.

ఆలోచించగా మీనారులు కలిసేచోటు అంటే ఆ మీనారులనీడలు కలిసేచోట అని గ్రహించుకున్నాడు. అవి కలిసేచోట త్రవ్వించి, అక్కడ నాలుగులక్షల నిధి ఉండడం గమనించి దానిని ఆ తల్లీకొడుకులకు అక్బరుపాదుషా వారిచే ఇప్పించాడు.

విషయాన్ని ఇంత నిశితంగా పరిశీలించి మసీదుకుగాని ఆ తల్లీకొడుకులకుగాని ఏవిధమైన నష్టము రాకుండా కాపాడిన బీర్బలు అక్బరాదుషా అభినందించాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment