దుప్పి తెలివి | Animated moral stories in Telugu

దుప్పి తెలివి

Animated moral stories in Telugu: అనగనగా ఓ అడవి. అందులో ఓ దుప్పి. ఓ రోజు గడ్డి మేస్తూ మేస్తూ… చాలా దూరం వెళ్లింది. ఇంతలో వాన పడింది. పక్కనే ఉన్న గుహలోకి వెళ్లి తలదాచుకుంది. కాసేపటికీ వర్షం తగ్గింది.

ఇక బయటకు వద్దాం… అనుకునే గుహవైపు వస్తున్న పెద్దపులి కనబడింది. ఒక్కసారిగా దుప్పి గుండె ఆగినంత పనైంది. గుహ చీకటిగా ఉండటం వల్ల తాను పెద్దపులికి కనబడే అవకాశం లేదనే ఆలోచన రాగానే కాస్త స్థిమితపడింది.

కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగి పోలేదు. పెద్దపులి ఏ క్షణంలో అయినా గుహ లోపలకు వచ్చేయొచ్చు. తానేమో బయటకు పరిగెత్తుకెళ్లి పారిపోయే అవకాశం లేదు.

వెంటనే మెరుపులాంటి ఆలోచన రావడంతో… ‘ఆ పెద్దపులి వచ్చే సమయం అయింది.. నిశ్శబ్దంగా ఉండు.. అది రాగానే మన ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం.

ముందే చెబుతున్నా… దాని గుండెకాయ మాత్రం నాకే. ఇప్పటికి తొంభైతొమ్మిది పులుల గుండెలు తిన్నా. ఇదొక్కటి తింటే వంద అవుతాయి’ అని దుప్పి గంభీరంగా గొంతు మార్చి మాట్లాడింది.

పెద్దపులికి ఏమీ అర్థం కాలేదు. తనకన్నా ఏవో పెద్ద జంతువులు గుహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది. ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదని పరిగెత్తింది.

దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది. ‘ఎందుకు పరిగెడుతున్నావు?’ అని పులిని అడిగింది. అది విన్న విషయం చెప్పింది. ‘పదా… వెళ్లి చూద్దాం!’ అని అది తోడేలు. పులి భయం… భయంగానే ఒప్పుకుంది.

గుహలో నుంచి దుప్పి బయటకు వద్దాం అనుకునేంతలోనే దానికి ఈ సారి తోడేలు, పెద్దపులి కనిపించాయి. మరో సారి గొంతు మార్చి పెద్దపులి వచ్చేలా లేదు కానీ…

ఈ లోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్లి చూసొస్తా… మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి. ఈ రోజు మనం పులి. తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే అని గంభీరంగా అది అంతే…

తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్త బోయింది. ఈ కంగారులో అది పెద్దపులిని ఢీకొట్టింది. ఒక్కసారిగా పులికూడా ఉలిక్కిపడి… కిందపడింది.

వెంటనే పైకిలేచి ఈ సారి మరింత వేగంగా పరుగుపెట్టి పారిపోయింది. తోడేలు ದಾನ್ನಿ అనుసరించింది. ‘బతుకు జీవుడా!’

అనుకుంటూ దుప్పి గుహ నుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది. ఇంకెప్పుడూ ఆ గుహ వైపు వెళ్లే సాహసం చేయలేదు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment