ఖాళీగూడు | Animated Telugu Stories

ఖాళీగూడు

Animated Telugu Stories: అన్విత, అనీష్ తో పాటు భార్యను వెంట తీసుకుని సీతారామయ్య ఇందిరాపార్కి వెళ్ళాడు. కొద్దిసేపు బోటింగ్ చేసాక వారు పార్కంతా తిరిగి చూస్తూంటే, ఓచోట నేలమీద పడి ఉన్న ఓ పక్షి గూడుని అనీష్ చూసాడు.

“అదేమిటి తాతయ్యా?” అడిగాడు. “పక్షి గూడు, చెట్టుమీంచి కిందపడి పోయిన ట్లుంది.” “అందులో పక్షులు ఉన్నాయా?” అన్విత అడి గింది. “లేవు. అది ఖాళీ గూడు.

సీతారామయ్య దాని దగ్గరకి వెళ్ళి పరీక్షగా చూసి చెప్పాడు. “ఇది గోరింక కట్టుకున్న గూడు.” “కూల్! దీన్ని మేము అమెరికాకి తీసుకె ళ్ళవచ్చా?” అనీష్ అడిగాడు.

తల ఊపి సీతారామయ్య దాన్ని తీసి తన చేతి లోని సంచీలో ఉంచాడు. “అది ఎందుకు ఖాళీ అయింది? అది పిల్లల కోసం కదా గూడు కట్టింది?” అనీష్ అడిగాడు. “అవును.

కానీ పిల్లలు పెద్దయి రెక్కలొచ్చాక వెళ్ళిపోయాయి. దాంతో ఆ గూడు ఖాళీ అయింది.” “మరి పెద్ద పక్షులేమయ్యాయి?” “అవి ఇంకో గూడు కట్టుకుని వాటిలో మళ్ళీ పిల్లల్ని పెడతాయి.”

“తాతయ్య! మీ ఇల్లుకూడా ఖాళీగూడే కదా?” కొద్దిసేపాగి అనీష్ అడిగాడు. “ఎందుకని?” “గోరింక పిల్లలు వెళ్తే ఈ గూడు ఖాళీ అయిపో యినట్లుగా మీ పిల్లలు ఇద్దరూ అమెరికాకి వెళ్ళి పోతే మీ గూడు కూడా అయిపోయింది కదా?” “అవును.

రేపు మీరు పెద్దయి కాలేజీకి వెళ్ళి, ఆ తర్వాత ఉద్యోగం వచ్చాకో లేదో పెళ్ళిచేసుకు న్నాకో వెళ్ళిపోతే మీ గూడు కూడా ఖాళీ అవు తుంది.

ఇది లోక సహజం.” సీతారామయ్య చెప్పాడు. అంతసేపూ వారి సంభాషణని మౌనంగా వింటున్న సీతారామయ్య భార్య చెప్పింది. “కాకపోతే మనమంతా ఓ పెద్ద గూడులోనే కలిసి ఉంటున్నాం.

కాబట్టి ఒకర్ని మరొకరం మిస్ “అవడం లేదు.” “పెద్ద గూడు ఎక్కడ ఉంది?” అన్విత వెంటనే అడిగింది. “ఈ ప్రపంచమే ఆ పెద్ద గూడు. మనమంతా. దేవుడి పిల్లలం.

కాబట్టి మనమంతా ఒకే కుటుం బానికి చెందిన వాళ్ళం. ఈ గూడుని వదిలి వెళ్ళడం అంటే మరణించడమే. అంతదాకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకరినొకరు చూసుకోగలం” ఆవిడ చెప్పింది.

“ఓ!” ! “కాకపోతే మనమంతా ఒకే గూటిలో ఉన్నాం అన్న సంగతి తెలుసుకోకుండా ఒకరికొకరం దూరమైపోయాం అనుకుని చాలామంది బాధప డుతూంటారు.

ఇది తప్పు. కాబట్టి మీరు తిరిగి అమెరికా వెళ్ళబోయేముందు మమ్మల్ని వదిలి వెళ్తు న్నామని ఏడవ కూడదు”- సీతారామయ్య వారికి చెప్పాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment