దేముడు చేయలేని పని | Best Telugu Stories of Akbar and Birbal for Children

దేముడు చేయలేని పని

Best Telugu Stories of Akbar and Birbal for Children

Best Telugu Stories of Akbar and Birbal for Children: ఒకనాటి రాత్రిపాన్పుపై పరున్న అక్బరు పాదుషా వారికి ఒక ఆలోచన కలిగింది. దేముడు సర్వసమర్థుడు ఆయన చేయలేని పనంటూఉండదు. అట్లాగుననే తానుకూడా సర్వసమర్ధుడు.

తనకంటూ అసాధ్యమైన పనిలేదు. కాని సృష్టి మాత్రం తనకు అసాధ్యం. అల్లాగుననే భగవంతునకు అసాధ్యమైన పనేదయినా ఉన్నదా అని అనుమానం కలిగింది. ఎంతగా ఆలోచించినా అక్బరుకు కలిగిన ఈ శంక తీరలేదు.

మర్నాడు దర్బారులో యుక్తాయుక్తంగా బీర్బల్న ప్రశ్నించేడు అక్బరు. “బీర్బల్ నేను సమస్తమైన పనులను చేయగలవాడనుగదా! మరి నావలె భగవంతుడు అన్ని పనులు చేయగలడా?”

అని సగర్వంగా ప్రశ్నించేడు “చిత్తం తమరు సర్వసమర్థులు దేముడు మీకు సరిగాడు.. మీరు చేయగల పనులు కొన్ని ఆయన చేయలేడు. మీకున్న అవకాశం ఆయనకు లేదన్నాడు.

తనను అధికుడ్ని చేసిపలికిన బీర్బల్ పలుకులలో తాను చేసేది. భగవంతుడు చేయలేనిది యేమిటో తోచలేదు. తాను గ్రహించలేకపోయిన విషయం

వెల్లడికాకూడదన్న ఆసక్తితో బీర్బల్ నాకు మాత్రమే సాధ్యమయ్యే పనేమిటో తోచక తికమక పడుతున్న సభికుల సంశయాన్ని తీర్చు” అన్నాడు అక్బరు.

చిత్తం జహాపనా! సువిశాల ప్రపంచము అంతా ఆయనదే. తమకున్న సామ్రాజ్యమంతా తమదే. తమకు ఎవరి మీదనైనా అగ్రహంవస్తే తమరు తమ రాజ్యాన్ని విడిచిమరెక్కడికైనా పొమ్మని శాసించగలరు.

ఇది దేవునకు సాధ్యంకాదు – పరాయితావుకు తన జగత్తులో ఎక్కడికని పొమ్మనగలదు జహాపనా! మీరుచేయగల ఈపని దేవుడు చేయలేడు అని ప్రభువుకు జ్ఞానోదయమయ్యేలా సున్నితంగా వివరించాడు బీర్బల్.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment