ప్రాణానికి ప్రాణం | Chandamama Telugu Stories

ప్రాణానికి ప్రాణం

Chandamama Telugu Stories: ఒకసారి మర్యాదరామన్న న్యాయస్థానానికి న్యాయం కోసం రామయ్య, సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. సోమయ్య తన చేతి సంచిలోంచి ఒక చచ్చిన పామును బయటికి తీశాడు.

ఆ పాము తల బాగా చితికిపోయి ఉంది. “అయ్యా రామన్నగారూ, చూడండి నా పామును ఇతడెలా భయంకరంగా చంపేశాడో. ఇది ఇతనికి ఏ హానీ చేయలేదు.

కారణం లేకుండా అన్యాయంగా నా పామును చంపాడు,” అంటూ కోపంగా చెప్పాడు సోమయ్య. “అతను చెప్పింది నిజమే ప్రభూ! అదొక విషప్రాణి. చచ్చిపోయినా | కూడా ఎంత భయంకరంగా ఉందో చూడండి.

సోమయ్య దాన్ని స్వేచ్ఛగా బయటికి వదిలేశాడు. అది నన్నేం చేయలేదు. కాని ఎవరైనా పొరపాటుగా దాని దగ్గరకు వెళితే అది కాటేయక మానదు. అందుకే దాన్ని చంపేశాను.

అందరి మంచి కోసం చేసిన ఈ పని నేరమైతే నన్ను శిక్షిం చండి,” అని వినయంగా చెప్పాడు రామయ్య. కథ చంపాలనే “పాము ప్రమాదకరమైనది. సహజంగా మనుషులు దాన్ని చూస్తారు.

బయటికి రాకుండా నీ పామును నువ్వు జాగ్రత్తగా కాపాడు | కోవాల్సింది” అంటూ మర్యాదరామన్న సోమయ్యకి సర్దిచెప్పబోయాడు.

మర్యాదరామన్న మాటను ఏ మాత్రం వినిపించుకోకుండా “కంటికి కన్ను, పంటికి పన్నే సరైన న్యాయమని నేను నమ్ముతాను. నా పాము | ప్రాణాలకు బదులు ఇతని ప్రాణాలు తీయాల్సిందే.

నేరస్తులను మీరు శిక్షిం చకపోతే రాజ్యంలో ఘోరాలు ఇలాగే పెచ్చుపెరిగిపోతాయి. నేను ఇతణ్ణి వదలను. నా పామును ఏ విధంగా చంపాడో ఇతన్ని కూడా అదే విధంగా చంపుతాను” అన్నాడు అవేశంగా సోమయ్య.

సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్న మర్యాదరామన్నకు ఒక ఆలోచన తట్టింది. “నీ పామును| రామయ్య ఎలా చంపాడు?” అని అడిగాడు రామన్న.

“ఎలా చెప్పమంటారు? దాని తోక పట్టుకుని గిరగిరా గాల్లో తిప్పి నేలకేసి విసిరి కొట్టాడు.” అని చెప్పాడు సోమన్న. “సరే, నువ్వు కూడా అలాగే చంపు.

అతని తోక పట్టుకుని గాల్లోకి లేపి గిర గిరా నెలకేసి కొట్టు” అని తీర్పు చెప్పాడు. సోమయ్య అయోమయంలో పడ్డాడు. “మనిషికి తోక ఉంటుందా? ఆ తోక పట్టుకుని గాల్లో తిప్పి చంపడం సాధ్యమేనా? ఇదసలు కుదిరే పని కాదు” అన్నాడు.

అప్పుడు న్యాయాధికారి శాంతంగా “ఔను నిజమే. మనిషికి తోక ఉండదు. అతన్ని పాములా చంపలేం. కాబట్టి నువ్వు నీ ఫిర్యాదును వెనుకకు తీసుకుని ఇంటికి వెళ్ళిపో” అని తీర్పు చెప్పాడు.

మర్యాదరామన్న ఇచ్చిన తీర్పుకి ఏం చేయాలో పాలుపోక తన తప్పు తెలుసుకుని తల వంచుకుని ఇంటికి వెళ్లిపోయాడు సోమయ్య.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment