సోమరి సుబ్బయ్య | Children’s moral tales Telugu

సోమరి సుబ్బయ్య

Children's moral tales Telugu

Children’s moral tales Telugu: అనంతవరం ఊరికి కూతవేటు దూరంలో అడవి ఉంటుంది. పిల్లలంతా ఆ అడవికి వెళ్లి కావాల్సిన పండ్లూ, కాయలూ కోసుకుని తినేవారు.

కొందరైతే తినగా మిగిలినవి ఇంటికి తెచ్చుకునేవారు. ఒకరోజు చంద్రయ్య అనే పిల్లాడు పండ్లు తెచ్చు కుందామని సంచి తీసుకుని అడవిలోకి వెళ్లాడు.

పండ్లన్నీ చిటారు కొమ్మలకి ఉండటంవల్ల కోసుకోవటానికి చేతకాలేదు. ఎండలో చాలాసేపు తిరిగి చివరకో చెట్టుకింద సొమ్మసిల్లి పడిపోయాడు.

అంతలో అక్కడికి కోతులు గుంపు ఒకటి వచ్చింది. అత డిని చూసి… ‘పాపం పండ్ల కోసం వచ్చినట్లున్నాడు. మనం సాయం చేద్దాం’ అందొక కోతి. సరేనన్నాయి మిగిలిన కోతులు.

పెద్దవి చెట్టుమీదకు వెళ్లి చిటారు కొమ్మల్ని కదిల్చి పండ్లు కింద పడేలా చేస్తే, చిన్నవి వాటిని సంచిలో వేశాయి. తర్వాత అక్కణ్నుంచి వెళ్లిపోయాయి.

కొద్దిసేపటికి చంద్రయ్యకు మెలకువ వచ్చి చూస్తే తన చుట్టూ, సంచినిండా పండ్లు ఉన్నాయి. దూరంగా కోతుల్ని చూసి అవే పండ్లు ఇచ్చాయని అర్థం చేసుకున్నాడు.

కొన్ని తిని సంచితో పండ్లని తీసుకొని ఇంటికివెళ్లి జరిగింది చెప్పాడు. ఇది విని సుబ్బయ్య అనే యువకుడు పెద్ద సంచి తీసుకుని అడవిలోకి వెళ్లాడు.

అక్కడ ఒక బాగా పండ్లు ఉన్న పెద్ద చెట్టుకింద సొమ్మసిల్లి పడిపోయినట్లుగా నటించాడు. అతడు కోరుకున్నట్టే కాసేపటికి కోతులు వచ్చాయి.

సుబ్బయ్యకి సాయం చేయాలనుకున్నాయి. కొన్ని చెట్టుపైకి ఎక్కి పండ్లను కోయగా కొన్ని సంచిలో వేస్తున్నాయి. ఆ సమయంలో | కోతులు తన సంచిని నింపుతున్నాయో లేదో చూద్దామని ఒక కన్ను తెరిచాడు సుబ్బయ్య.

ఒక పిల్లకోతి దీన్ని గమనించి మిగతావాటికి చెప్పింది. అతడు తమను మోసం చేస్తున్నాడని అర్థమై మీదకి దూకాయి. ఇది గమనించి సుబ్బయ్య ఒక్కసారిగా లేచి పరుగు అందుకున్నాడు.

కొంత దూరం వెళ్లాక ఒక పెద్దాయన కోతుల్ని తరిమి అతణ్ని రక్షించాడు. జరిగింది తెలుసుకుని సుబ్బయ్యని మందలించాడు.

‘దురాశ దుఃఖానికి చేటు’ అని చెప్పి తన కష్టాన్ని తానే నమ్ముకోవాలని సుబ్బయ్యకు చెప్పాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment