ఇచ్చి పుచ్చుకోవడం | Classic Telugu Moral Tales

ఇచ్చి పుచ్చుకోవడం

Classic Telugu Moral Tales: ఆఫీసు నుంచి తిరిగొచ్చిన శ్రీకాంత్ దుస్తులు మార్చుకుంటుండగా తను తొడు క్కున్న బనియను చాలాచోట్ల చిరిగిపోయి కనిపించింది.

పిసి నారితనంతో ఇంతకాలం నెట్టు కొచ్చాడు. ఇప్పుడు కొత్తబని కొనాలని నిశ్చయాని కొచ్చాడు. క్లాక్ టవర్ దగ్గరున్న కొట్టు కెళ్ళి ఇరవై రూపాయల్లో చౌక బారు బనియను కొన్నాడు. దారి లో చూడాలనిపించి, బని యన్ను కవర్లోంచి తీశాడు.

అందులో రెండు కనిపించాయి. షాపువాడు పొరపాటున రెండు బనియన్లు పెట్టేశాడు. శ్రీకాంత్ దీర్ఘాలోచనలో పడ్డాడు. మనసు సంబరపడింది- నయమే, ఒకటికి రెండొ చ్చాయి.

అంతరాత్మ మాత్రం హెచ్చ రించింది. ‘ఈ జన్మలో ఒకవేళ దుకాణదారుని ఇరవై రూపాయలు ముంచితే, వచ్చే జన్మలో అతని రుణం తీర్చుకోవడానికి ఏం పాట్లు పడాల్సివ స్తుందో? ఏదోరూపంగా బదులు తీర్చాల్సిందే’ అని.

బనియను ఆ భయం కలగ్గానే శ్రీకాంత్ పొరపాటున వచ్చిన రెండో తిరిగిచ్చేయాలని వెనుదిరిగాడు. అయితే, కొంచెం దూరం వెళ్ల గానే, శ్రీకాంత్ మనసులో మరో ఆలోచన కలిగింది.

బహుశా ఆ దుకాణుదారే గత జన్మలో నా దగ్గర ఇరవై రూపాయలు ఎలాగో కొట్టేసి ఉంటాడు. ఆ లెక్క సరిపోవడా నికి దేవుడు ఇప్పుడు వాడితో ఈ పొరపాటు చేయించిన ట్టుంది.

ఇది పూర్వజన్మ రుణమే కావచ్చు. ఇప్పుడు తీరుంటుంది. ఇందులో ఆందోళన చెందాల్సిన.. ఆ తలంపు మనసులో మెదలగానే నిశ్చిం తగా ఇంటికి తిరుగుముఖం పట్టాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment