మంగలికి బ్రాహ్మణత్వం | Famous Akbar Birbal Kathalu in Telugu

మంగలికి బ్రాహ్మణత్వం

Famous Akbar Birbal Kathalu in Telugu

Famous Akbar Birbal Kathalu in Telugu: అక్బరాదుషాకు తన మంగలిపైన, అతని పనితనంపైనా అపారమైన అభిమానం కలిగింది. నీకేంకావాలో కోరుకోమన్నాడు పాదుషా. జహాపనా! మా మంగళ్ళను నాయీబ్రాహ్మణులంటారు.

కాని నాకు బ్రాహ్మణుడిని కావాలని ఉన్నది కనికరించండి, అని కోరుకున్నాడు. అక్బర్ వేదవిధులైన బ్రాహ్మణులను పిలిపించి, ఈ నా మంగలిని మీ పునీతమైన మాతాదిక్రతువుతో బ్రాహ్మణునిగా మ ర్చవలసినదని అదేశించాడు.

ప్రభువుమాట మన్నించకపోతే శ్రేయస్సుకు ప్రమాదం కలుగుతుందని భయపడిన ఆ విప్రులు, ఆ మంగలిని నదిఒడ్డుకు తీసుకువెళ్ళి స్నానం చేయించి, మంత్రాలు ఉచ్చరించి, యాగాలు చేయించి నానాతంటాలు పడుతూ ప్రయత్నించారు.

ఈ సంగతి బీర్బలు తెలిసింది. ఒక నల్లమేకను నది ఒడ్డుకు తీసుకువెళ్ళి నీట ముంచి, దాని శరీరాన్ని నది ఒండ్రుమట్టితో రుద్ది, ఏవేవో మంత్రాలు చదవడం చేస్తున్నాడు.

ఈ సంగతి తెలిసి అక్బరాదుషా నది ఒడ్డుకు వచ్చి బీర్బల్‌ను ఉద్దేశించి యేం చేస్తున్నావని ప్రశ్నించాడు. అయ్యా ఈ నల్లమేకను కపిలగోవును చెయ్యడానికి ప్రయత్నిస్తున్నానన్నాడు.

ఏమిటిది? నీకేమన్నా మతిపోయిందా. మేక కపిలగోవు కావడం ఏమిటని, అక్బరు బీర్బల్‌ను వెటకారం చేసాడు. క్షమించాలిజహాపనా! మంగలి బ్రాహ్మణుడుకాగా ఈ నల్లమేక కపిలగోవుకాదా?

అన్న విశ్వాసంతో ప్రయత్నిస్తున్నాను అన్నాడు బీర్బల్. తన తెలివి తక్కువ తనానికి సిగ్గుపడిన అక్బరు తనను అతి సున్నితంగా సంస్కరించిన బీర్బల్‌ను అభినందించాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment