నీవు నేర్పిన విద్య నీరజాక్ష | Folk tales in Telugu

నీవు నేర్పిన విద్య నీరజాక్ష

Folk tales in Telugu: ఒక ఊర్లో ఒక బీదదంపతులు ఉండేవారు. వారికి లేకలేక ఒక కొడుకుపుట్టాడు. వాడి పురుటి రోజుల్లోనే తల్లి చనిపోయింది. అందుచేత చిన్నప్పటినుండి దాని బాగోగులను తండ్రే చూసుకొనేవాడు.

ఏలోటూ రాకుండా. పెంచి పెద్దచేసి వానికి విద్యాబుద్ధులు నేర్పించాడు తండ్రి. ఏ చెడు అలవాట్లూ లేకుండా వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. వానికొక పెద్ద ఉద్యోగం వచ్చింది.

వాడు కష్టపడి పనిచేసి అందరి మెప్పును పొందుతూ వేరే ఊర్లో ఉంటున్నాడు. కాని దానికి పల్లెటూళ్ళో నున్నతండ్రి అంటే పూర్తిగా యిష్టంలేకుండా పోయింది.

కొన్నినాళ్ళ తర్వాత మంచి కట్నంతో ఒకపట్నం పిల్ల వానికి భార్యగా వచ్చింది. మరి కొన్నాళ్ళకు వాళ్ళకొక చక్కని కొడుకు పుట్టాడు.

పల్లెటూళ్ళో వంటరిగా ఉండలేక ముసలివాడు పట్నంలోని తన కొడుకు దగ్గరకు చేరుకొన్నాడు. తన ముసలితండ్రివల్ల తన గౌరవంతగ్గి పోతుందని ఆ కొడుకు ఎంతోబాధ పడిపోయేవాడు.

ఆ ముసలివాణ్ణి దొడ్లోని ఒకపాకలో ఉంచి మిగిలిపోయిన, పాడైపోయిన పదార్థాల్ని అతనికి తినడానికి యిచ్చేవాడు. అతడు కట్టుకోవడానికి తన పాత బట్టల్ని యిస్తూండేవాడు.

చంటివాడు చిన్నప్పటినుండీ తాతగారితో చనువుగా ఉంటూ ఆయనతోనే ఎక్కువ కాలక్షేపం చేసేవాడు. పదిసంవత్సరాల వయస్సునుండీ యింట్లోని పరిస్థితులన్నీ వాడికి అర్ధమౌతున్నాయి.

“పాపం! తాతగార్ని వీళ్ళు ఎంతో బాధపెడ్తున్నారు! ఆయన్ను ఒక ముష్టివానిలాగా చూస్తున్నారు” అనుకొని ఎంతో బాధపడుతుండేవాడు.

ఒకరోజున చలిఎక్కువగా ఉండి ముసలితాత వణకుతున్నాడని ఆ మనవడు తన తండ్రి రగ్గుని (కంబళిని) తీసుకెళ్ళి తాతకు యిద్దామనుకొంటున్నాడు.

ఈలోగా అక్కడికి వచ్చిన తండ్రి వాని ఉద్దేశ్యం తెలుసుకొని “అది నా కంబళీ! దాన్ని యివ్వవద్దు. ఇదిగో ఈ పాత గొంగళీని ” అన్నాడు. ఇంక తప్పనిసరై వాడు ఆపాత గొంగళీనే తాతకు యిచ్చి వచ్చాడు. కాని వాడి మనస్సుకు ఆపని నచ్చలేదు. చాలాసేపు బాధపడ్డాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment