హత్య | Inspirational Telugu Stories

హత్య

Inspirational Telugu Stories: టూటౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ సూర్యం, రంగయ్యలు అప్పుడే నైట్ పెట్రోలింగ్ డ్యూటీకి ఉపక్రమించారు.

ఆవీధి చివరనున్న వేడివేడి టీ తాగి, ఇద్దరూ సిగరెట్లు వెలిగించారు. గుండెల్నిండా పొగపీల్చి తృప్తిగా వదులుతూ లాఠీలూపుకుంటూ నడక మొదలు పెట్టారు.

ఓ ఇంటిముందు నుంచి వెళ్ళబోతూ ఇంటిలోపల్నుండి వినవస్తున్న మాటలకి అక్కడే ఆగిపోయారు. లోపల్నుంచి. వినబడు తున్న మాటలు వారికి అనుమానం చాయి.

“ఏంట్రా.. గుడ్లప్పగించి చూస్తావ్.. ముందు మెడ కట్ చెయ్.. ఊఁ.. తర్వాత చేతులు.. త్వరగా కానియ్”.. అన్న ఆ మాటలువిని లోపలేదో పెద్దఘోరం జరిగిపోతోందనుకు న్నారు.

డ్యూటీ ఎక్కగానే మంచి కేసు దొరికి పోయిందనీ.. దాంతో ప్రమోషన్ వచ్చేస్తుందని తెగ సంబరపడిపోయారు. ఇంటితలుపు లాఠీతో కొట్టారు. తలుపు తెరుచుకోలేదు.

ఇద్ద రికీ అనుమానం బలపడింది. మళ్ళీ తలుపులు గట్టిగా కొట్టి “రేయ్! లోపలెవర్రా.. తలుపు తీస్తారాలేదా? ” అని అరిచారు.

తలుపు మెల్లగా తెరుచుకుంది. లోపల ఓ వ్యక్తి బల్లమీద కొత్త బట్టని టేప్ తో కొలుస్తూ కత్తెరతో కట్చేస్తూ కనిపించాడు. తలుపు తెరచిన వ్యక్తి భయంతో కానిస్టేబుళ్ళిద్దర్నీ చూస్తూ నిలబడ్డాడు.

సూర్యం, రంగయ్యలు మాటాపలుకూ లేకుండా నీరసంగా వెనుదిరిగారు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment