అల్పులతో సహవాసం అనర్థం | Inspiring stories in Telugu

అల్పులతో సహవాసం అనర్థం

Inspiring stories in Telugu: ఉజ్జయిని నగరానికి సమీపాన ఉన్న అడవిలో ఒక పెద్ద రావిచెట్టు ఉంది. దాని మీద ఒక కాకి, ఒక హంస నివసి స్తున్నాయి. కాకిది దుష్టస్వభావం

అల్ప బుద్ధి అని తెలిసి కూడా పొరుగున ఉం టోంది కదా అని దాంతో స్నేహంగానే ఉండసాగింది హంస. ఒకరోజు ఆ అడవికి వేటగాడు వచ్చాడు.

ఎంత ప్రయత్నించినా ఏమీ |దొరకకపోవడంతో వెనుదిరిగి పోతూ. కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు కింద ఆగాడు.

అలసిపోయి ఉండటంతో వేటగాడికి వెంటనే నిద్రప ట్టేసింది. అది వేసవి కాలం, గాలి లేదు. అతనికి శరీరం అంతా చెమట పట్టింది.

మంచి స్వభావం కలిగిన హంస కొమ్మ మీద నిలబడి అతడికి తన రెక్కలతో విసరసాగింది. ఇంతలో అల్పబుద్ధి గల కాకి వచ్చింది.

హంస చేస్తున్న పరోప కారం చూసి నవ్వింది. “వాడు వేట గాడు! మనల్ని బాణాలతో వేటాడ తాడు. వాడికి సేవ చేస్తున్నావు. ఎంత పిచ్చిదానివి” అని ఎగ తాళి చేసింది.

అంతటితో ఆగ కుండా ఆ కాకి నిద్రపోతున్న వేటగాడిపై రెట్ట వేసి, తలమీద తన్ని ఎగిరిపోయింది. దాంతో వేటగాడికి నిద్రా భంగం కలిగింది.

ఒంటి మీద ఉన్న రెట్ట చూశాడు. కోపం వచ్చింది. వెంటనే చూశాడు. హంస తప్ప అక్కడ మరే ప్రాణీ కనిపించ లేదు. తన మీద హంస రెట్ట వేసిందనుకు న్నాడు.

వెంటనే తన బాణాన్ని హంసకు గురి చూసి వదిలాడు. ఆ బాణం దెబ్బకి హంస చనిపో యింది. వేటగాడు దానిని తీసు కుని ఇంటికి వెళ్లిపోయాడు.

నీతి: అల్పులతో సహవాసం అనేక ప్రమాదాలను తెస్తుంది.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment