నిత్య సంతోషి | Interactive Telugu stories for kids

నిత్య సంతోషి

Interactive Telugu stories for kids: పూర్వం ఒక రాజు వుండేవాడు. ఆయన చాలా ఐశ్వర్యవంతుడు, బలవంతుడూ. కానీ, ఆయన తన ప్రజల యోగక్షేమాల గురించి పట్టించుకునే వాడు కాదు.

కొన్నాళ్ళకు అతనికి జబ్బు చేసింది. దీంతో విచారగ్రస్థుడైన ఆ రాజు ఆ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలనుకున్నాడు. ఎంతో మంది సుప్రసిద్ధ వైద్యులు వచ్చి అతణ్ణి పరీక్షించారు.

కానీ, ఎవరూ నయం చేయలేక పోయారు. రాజుకు కోపం వచ్చి వాళ్ళందరినీ కారాగా రంలో బంధించాడు. అలా ఉండగా వేరే దేశం నుంచి ఇద్దరు ఘన వైద్యులు వచ్చారు ఆయనకు చికిత్స చేయటా నికి మొదటి వైద్యుడు రాజును పరీక్షించాడు.

అతడు అంతగా తెలివితేటలు లేని వాడు. “అయ్యా! మీకు జబ్బు లేదు. మీ ఆరోగ్యం దివ్యంగా ఉంది. లేని జబ్బు ఉన్నట్టుగా ఊహించుకొని అనవసరంగా బాధపడుతున్నారు”.

అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. రాజుకు కోపం వచ్చి అతణ్ణి చీకటి కొట్లో వేయించాడు. అ చూసిన రెండో వైద్యుడు రాజుగారిని రకరకాలుగా పరీక్షించి, “అయ్యా మీరొక వింత వ్యాధి.

నిత్యం సంతోషంగా వుండే వ్యక్తి పాదరక్షలు. ధరిస్తే వెంటనే తగ్గిపోతుంది” అన్నాడు తెలివిగా. రాజు సంతోషించి అతనికి ఒక సంచినిండా బంగారం కానుకగా ఇప్పించాడు.

ఆ తర్వాత తన భటులకు “ఆ నిత్య సంతోషిని పట్టుకొని రండి” అని నలుమూలలా పంపించాడు. వాళ్ళు వెతకగా, వెతకగా ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండే ఒక బిచ్చగాడు కనిపించాడు.

ఉన్న ఫలంగా అతణ్ణి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు భటులు. “దయచేసి నీ చెప్పులు ఇవ్వు. దానికి బదులుగా నువ్వు కోరింది. ఇస్తా” అన్నాడు రాజు.

అందుకు బిచ్చగాడు “అయ్యా! నాకు నాదంటూ ఏదీ లేక పోవడం వల్లే నిత్యం సంతోషంగా ఉండగలుగుతున్నా. నాకు చెప్పులు కూడా లేవు” అన్నాడు నవ్వుతూ.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment