పరిష్కారం | Kids’ bedtime stories in Telugu

పరిష్కారం

Kids’ bedtime stories in Telugu: రామవరంలో కృష్ణయ్య అనే రైతు ఉండేవాడు. అతడు జీవితంలో చాలా కష్టపడి పైకివచ్చాడు. తన ఎదుగుదలకు కారణం గురువు శ్రీనివాసశాస్త్రి అని అందరితో చెప్పేవాడు.

కృష్ణయ్య వృద్ధుడయ్యాక తన కొడుకులిద్దరినీ పిలిచి గురువుగారి సలహాలతో హాయిగా బతకండని చెప్పాడు. కృష్ణయ్య చనిపోయాక అతడి ఇద్దరు కొడుకులూ గురువు దగ్గరకు వెళ్లారు.

ఆయన ఇద్దరికీ రెండు చీటీలిచ్చి… ‘మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నపుడు మాత్రమే వీటిని తెరిచి చూడండి. వీటిలోని మంత్రం జీవితంలో ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది’ అని చెప్పి చీటీల్ని చేతిలో పెట్టాడు.

పెద్దవాడు తన వాటాగా వచ్చిన పొలం సాగుచేసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైనా కష్టం వచ్చినపుడు గురువు ఇచ్చిన చీటీ తెరిచి చూడాలని అనుకునేవాడు.

కానీ అది ఒక్కసారికే ఉపయోగపడుతుందన్న మాట గుర్తొచ్చి ఆ ఆలోచన మానుకునేవాడు. సమస్యను తన శక్తిమేర పరిష్కరించు కునేవాడు. రెండోవాడు మాత్రం ఓసారి చిన్న సమస్యేదో రావడంతో గురువు ఇ చీటీని తెరిచి చూశాడు.

నీది చాలా చిన్న సమస్య త్వరలోనే తీరిపోతుంది’ అని దాన్లో రాసుంది. ఆ ధీమాతో ధైర్యం తెచ్చుకున్నాడు. నెమ్మదిగా ఆ సమస్యనుంచి బయటపడ్డాడు.

ఆ తర్వాత మళ్లీ మళ్లీ అతడికి సమస్యలు వచ్చాయి. వాటికి పరిష్కారం తెలియక నిత్యం ఇబ్బందిపడేవాడు. పెద్దవాడు మాత్రం జీవితంలో ఎప్పుడూ చీటీ తెరవకుండానే

అవసరమైతే చీటి ఉందన్న ధీమాతో సమస్యలన్నీ తనకుతానుగా పరిష్కరించుకొంటూ సంతోషంగా జీవించాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment