కోతలరాయుడు | Moral Stories in Telugu

కోతలరాయుడు

Moral Stories in Telugu

ఒకరోజున ఒకవస్తాదు రాజుగారి వద్దకు వచ్చాడు. అతడు రాజుగారితో “రాజా! నేను చాల బలవంతుణ్ణి. నేను ఒకసారి ఒకపర్వతాన్ని కూడా పైకి ఎత్తాను. నేను రోజూ వందశేర్ల పాలు తాగుతాను.

నేను సింహాలతో కూడా పోట్లాడాను” అని చెప్పాడు. ఆ కండలు తిరిగినవీరుని చూచి రాజుగారు చాల మెచ్చుకున్నారు. “ఇటువంటి వీరుడు నా రాజ్యంలో ఉంటే ముందు ముందు చాల ఉపయోగముంటుంది” అనుకొని రాజుగారు అతణ్ణి తన కొలువులో ఉద్యోగిగా నియమించారు.

నిజానికి ఆ వస్తాదుకు పనేమీ ఉండేదికాదు. మితిమీరిన తిండిమెక్కడం- శుభ్రంగా గుర్రుపెట్టి నిద్రపోవడం! ఇట్లా కొన్నాళ్ళు గడచింది.

అక్కడకు దగ్గరలో ఒక పెద్ద అడవిఉంది. రాత్రికాగానే తోడేళ్ళు, పెద్దపులుల వంటి క్టూరజంతువులు ఆ రాజ్యంలోనికి ప్రవేశించి అనేక పశువుల్ని, ‘మనుషుల్నీ కూడా చంపితిని వేయసాగాయి.

ప్రజలు వచ్చి రాజుగారితో తమకష్టాల్ని తొలగించవల్సిందని మొరబెట్టుకున్నారు. ward, వస్తాదు, అతని సాహసకృత్యాలు జ్ఞాపకం వచ్చాయి.

వెంటనే ఆయన వస్తాదును పిలిపించి “నీవు ఇదివరకు ఒక పర్వతాన్ని ఎత్తి అవతలపడవేసినట్లు చెప్పావు. అది నాకు గుర్తుంది.

ఇప్పుడు మారాజ్యంలో అడవితోనున్న పర్వతమొకటి ఉంది. దాన్ని ఎత్తి ఎక్కడేనా పడవేయాలి.” అని చెప్పారు. అందుకు అంగీకరించాడు వస్తాదు.

ఆ రోజున మామూలుకంటె ఎక్కువ తిండితిని బోలెడన్ని పాలుత్రాగాడు. రాజుగారు, మిగతాఉద్యోగులూ తన వెంటరాగా వస్తాదు ఆ పర్వతం వద్దకు చేరుకొన్నాడు.

వెంటనే అతడు రాజుగారితో “మహారాజు! మీమనుష్యులచేత పర్వతాన్ని త్రవ్వించండి. అప్పుడు దానిని పైకెత్తి ఆవలపడవేస్తాను” అన్నాడు.

రాజుగార్మి పిచ్చెక్కినంత పనైంది. “ పర్వతాన్ని త్రవ్వడమేమిటి? పూర్వం. నీవే పర్వతాన్ని ఎత్తిపడవేశానని చెప్పావుకదా?” అని అడిగారు రాజుగారు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment