సోమరి గొల్లభామ | Moral story in telugu short

సోమరి గొల్లభామ

చలికాలం ప్రారంభం కాబోతోంది. చుట్టుప్రక్కల ప్రకృతి అంతా చాల అందంగా ఉంది. పక్షులకు మహా ఆనందంగా ఉంది. వాతావరణం ‘బాగుండడంచేత అందరికీ పుష్కలంగా ఆహారం లభిస్తోంది.

ఒకరోజున ఒకసోమరిగొల్లభామ ఒక ఆకుపై కూర్చొని ఏవో కూనిరాగాలు తీస్తోంది. అప్పుడు పూలు ఎక్కువగా ఉండటంచేత బాగా ‘మకరందంతాగి అది సంతోషంతో గంతులేస్తోంది.

హఠాత్తుగా దానికి ఒక చీమలదండు కన్పించింది. అవి ఏవో ఆహారపదార్థాల్ని మోసుకొనిపోతున్నాయి. వాటివని చూసిన గొల్లభామకు ఆశ్చర్యమనివించి “ఎందుకంత ‘శ్రమపడిపోతున్నారు?

ఈ చక్కటిగాలిని పీల్చుకొంటూ తిని, త్రాగి సంతోషంగా. ఉండవచ్చుకదా!” అని వాటిని వేళా కోళం చేసింది. చీమలు కష్టజీవులు,తెలివైనవి గూడా. “ఇది చలికాలం! మంచు ఎప్పుడు కురుస్తుందో ఎవరికీ తెలియదు.

ఆ రోజులకోసం యిప్పుడు మేము ఆహారం నిల్వ చేసుకొంటున్నాం. మంచుకురిసిందంటే ఇకపై ఆహారం దొరకదు” అన్నాయి చీమలు.

ఎప్పుడో రాబోయేదానికి యిప్పుడే మీరు బాధ పోతున్నారు” అంటూ యీలవేసుకొంటూ గొల్లభామ వెళ్ళిపోయింది. అప్పుడు సరిగా తీవ్రమైన చలికాలం.

చెట్ల ఆకులన్నీ రాలిపోయాయి. చీమలన్నీ నేలల్లోని పుట్టల్లోకి వెళ్ళి అక్కడే ఉంటున్నాయి. పక్షులన్నీ దక్షిణదిక్కుకు ఎగిరిపోయాయి.

గొల్లభామకు తిండిలేకుండా పోయింది. చుట్టుపక్కల ఏ ప్రాణీ లేదు. నేలంతా మంచుతో కప్పబడిపోయింది. ఏంచేయడానికి తోచక గొల్లభామ చీమలవద్దకు వెళ్ళి “కొంచెం ఆహారం పెట్టండి” అని అడిగింది.

ఆ గొల్లభామ ఎట్లా తమని వేళాకోళం చేసిందో చీమలకి జ్ఞాపకం ఉంది. “మేము మా యింట్లో క్షేమంగా ఉన్నాం. మా కష్టఫలాన్ని హాయిగా అనుభవిస్తున్నాం.

మాకు ‘తినదానికి బోలెడంత తిండి నిలవ ఉంది. నీవు మమ్మల్ని, చులకనచేసి మాట్లాడావు. ఆ సంగతి మేం మర్చిపోలేదు. అప్పుడు ఎండలో పాటలు పాడుతూ ఎగిరావు.

మరిప్పుడు పాడటం లేదేం? ఇక్కడి నుండి వెళ్ళిపో! నీ వంటి సోమరులంటే మాకుగిట్టదు” అన్నాయి. ఏడ్పు మొహంతో గొల్లభామ వెళ్ళిపోయింది.

నీతి :- పొదుపు అనేది ఒక మంచి సుగుణం.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment