చిన్న సహాయం | Moral lessons for children

చిన్న సహాయం

Moral lessons for children: రామాపురం అనే గ్రామంలో ఒకసారి భూకంపం సంభవించింది. ఇళ్ళన్నీ కూలిపోన డంతో ప్రజలందరూ ఊరు వదిలి వెళ్ళిపో యారు.

అక్కడికి కొన్ని ఎలుకలు వచ్చి ‘ఇక్కడ స్వేచ్ఛగా బతకవచ్చు’ అని రామాపురంలో స్థిరపడిపోయాయి. మనుషుల బెడద లేకపోవడంతో కొన్ని | రోజుల్లోనే ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

ఒకసారి ఊరి పక్కనే ఉన్న అడవికి నీటి కరువు వచ్చింది. వాగులు, వంకలు ఎండిపోయాయి. నీళ్ళు దొరక్క జంతువులు విలవిల్లాడాయి.

నీటిని వెతు క్కుంటూ ఒక ఏనుగుల గుంపు రామాపురం వైపు వచ్చింది. ఏను గులు రామాపురంలోని మంచి నీటి చెరువు వైపు వెళ్తుండగా అక్కడ దారిలో ఉన్న ఎన్నో ఎలుకలు వాటి కాళ్ళ కిందపడి నలిగిపోయాయి.

అది చూసి ఎలుకల రాజు ఏనుగుల దగ్గరకు వెళ్ళి “మీరు వేగంగా చెరువు దగ్గరకు వెళ్తూ ఉండగా మా అప్తులు, మిత్రులు మీ కాళ్ళ కింద నలిగి పోయారు.

మీరు తిరిగి అడవికి వెళ్ళేటప్పుడు ” మాలో ఇంకా ఎందరు నలిగిపోతారో అని బెంగగా ఉంది. దయచేసి మీరు వేరే దారిలో తిరిగి అడవికి వెళ్ళండి.

మేము కూడా మీకు ఏదో విధంగా సమయం వచ్చిన ప్పుడు సహాయపడతాం” అని చెప్పింది. “మేము తప్పకుండా వేరే మార్గంలోనే అడవికి వెళ్తాం.

అయితే మీలాంటి చిన్న జంతువుల నుండి మాలాంటి పెద్ద జంతువులు ఏ సహాయం ఆశించవు” అన్నాయి. ఏను గులు అన్న మాట ప్రకారం వేరే మార్గంగా అడవి చేరు కున్నాయి.

కొన్నాళ్ళ తరువాత అడవిలో కొన్ని ఏనుగులు ఒక వేట గాడు వేసిన వలలో చిక్కుకున్నాయి. మిగతా ఏనుగులకు ఆ ఏనుగులను ఎలా రక్షించాలో తోచలేదు.

ఆఖరికి ఏనుగుల నాయకుడు ఒక ఏనుగు చేత ఎలుకల రాజుకు కబురు పంపించాడు.

వేలాది ఎలుకలు అడవికి వచ్చి ఏను గులు చిక్కుకున్న వలను తమ పళ్ళతో కొరికి ఆ ఏను గుల విడుదలకు సహాయం చేశాయి. “ఎంత చిన్న నారైనా చేయగలిగే సహాయాన్ని తక్కువ అంచనా వేయకూడదు” అని తెలుసుకున్నాయి.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment