ప్రేమపూలు | Moral stories in Telugu for students

ప్రేమపూలు

Moral stories in Telugu for students: రామాపురంలో వెంకయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆయన ఆ ఊరివారికే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని వారికి కూడా వడ్డీలకు డబ్బు ఇచ్చేవాడు.

అయితే ఆనందపురం అనే గ్రామం నుంచి ఏ ఒక్కరూ వెంకయ్య దగ్గరకు అప్పు కోసం వచ్చే వారు కాదు. ఒకసారి వెంకయ్య అనుకోకుండా ఆనందపురం వెళ్లాడు.

సహజంగా వ్యాపారికి ఉండే కుతూహలంతో వెంకయ్య ఆ ఊరి స్థితి గతులను పరీక్షించాడు. అక్కడ అందరూ ఆనం దంగా ఉన్నారు. ఒకరితో ఒకరికీ గొడవలు లేవు.

ఎవరికైనా కష్టం వస్తే దాన్ని నలుగురూ పంచుకుంటారు. ఏ సమస్యా లేకుండా జీవిస్తు న్నారు. అందుకు కారణం ఏమిటని కూడా వెంకయ్య ఆరా తీశాడు.

ఒక వృద్ధురాలు “కొంత కాలం క్రితం మా ఊరికి ఒక ముని వచ్చాడు. ఆయన మాకు కొన్ని పూల మొక్కలు ఇచ్చాడు. ఆ మొక్కలకి పూలు గుత్తులు గుత్తులుగా పూసేవి.

ఒక పూల గుత్తిని మనం ఎవరికైనా ఇస్తే అది రెండింతలు అయ్యేది. అలా ఊరంతా అందరి ఇళ్లలోనూ ఆ పూల గుత్తులు ఉన్నాయి. అప్పటి నుంచి మేం ఆనందంగా ఉంటున్నాం” అని చాలా చెప్పింది.

వెంకయ్యకి అసూయ కల్గింది. ఎలాగైనా ఆ ఊరిలోని వారందరికీ కష్టాలు వచ్చేటట్టు చేయా లనుకున్నాడు. ఒకరాత్రి రహస్యంగా తన మను షులతో వారి దగ్గర ఉన్న పూల మొక్కలు.

వాటికి ఉన్న పూల గుత్తులను పీకేసి ఎవరికీ కన్పించకుండా దూరంగా పడేశాడు. కొన్నిరోజుల తరువాత వెంకయ్య పనిగట్టు కుని ఆనందపురం వెళ్ళాడు. ఏమీ తెలియనట్టు అందరినీ పరామర్శించాడు.

ఆ ఊరి స్థితి గతులు మారిపోయి, మనుషుల మధ్య పార పొచ్చాలు, గొడవలు కలిగి ఉంటాయని భావిం చాడ వెంకయ్య. కాని అక్కడి పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ఆ ఊరి ప్రజలు మునుపటి కంటే ఇంకా ప్రేమగా అభిమానంగా ఉన్నారు.

ఒక్క క్షణం వెంకయ్యకు మతిపో యింది. ఆ తరువాత దానికి కారణం ఏమిటో వెంకయ్య బాగా ఆలోచించాడు. అతనికి ముని మహిమ ఏమిటో అర్ధం అయ్యింది.

ఆ మహా నుభావుడు అభిమానం, స్నేహం, ప్రేమ అనే పూల తోటలు ఇండ్ల లోగిళ్ళలో కాదు జనాల మనసుల్లో నాటాడు. మొక్కల్లాగే అవి దినదినాభి వృద్ధి చెంది వారి హృదయం నిండి విచ్చుకు న్నాయి.

అందుకే బాహ్యంగా పెరిగిన మొక్కలు లేకపోయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇకముందు మార్పు రాదు కూడా’ అన్న సత్యం బోధపడ్డ వెంకయ్య ఇక ఆ ఊరి జోలికి వెళ్లే ప్రయత్నం చేయలేదు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment