నిపుణ | Neeti kathalu Telugu

నిపుణ

Neeti kathalu Telugu: ఎన్నో ఏళ్లుగా మహేష్, కిరణ్ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. బాస్ మహేష్క సేల్స్ ఎక్జిక్యూటివ్ గా ప్రమోషన్ ఇచ్చాడు. కిరణ్ మాత్రం ఆ పాత ఉద్యోగం సేల్స్ రిప్రజెంటేటివ్గానే మిగిలాడు.

దాన్ని అవమానంగా భావించి కిరణ్ రిజైన్ చేసి, “సార్! కష్టపడి పనిచేసే మాలాంటి వారిని మీరు గుర్తించడంలేదు. మిమ్మల్ని పొగిడి, మీ చుట్టూ తిరిగేవారికే ప్రమోషన్స్ ఇస్తారు.

అని నేరారోపణ చేశాడు. నిజానికి కిరణ్ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి అని బాస్కు తెలుసు. కానీ తనకీ మహేష్కి ఉన్న తేడాని అతను గ్రహించాలని ఒక పని అప్పగించాడు.

కిరణ్! అలా బజారుకెళ్ళి పుచ్చకాయలున్నాయోమో చూసిరా” అని పంపాడు. తిరిగి వచ్చిన కిరణ్, “ఉన్నాయి సార్!” అన్నాడు.

“మరి వాటి ధర ఎంత?” అన్నాడు బాస్, కిరణ్ మళ్లీ మార్కెట్కు వెళ్ళి వచ్చి, “సార్! కే.జి. 15 రూపాయలు” అన్నాడు. కిరణి పక్కనే కూర్చోమని చెప్పి, బాస్ మహేష్ న్ను పిలిచీ, మార్కెట్లో పుచ్చకాయలు ఉన్నాయో లేదో తెలుసుకొని రమ్మన్నాడు.

మహేష్ తిరిగి వచ్చి, “సార్! ఒక్కడే ఒక్కడు వాటిని అమ్ముతున్నాడు. కె.జి. 15 రూపాయలట. 10 కె.జీలు కొంటే 130కి ఇస్తాడట.

అతని దగ్గర బల్లమీద 58, సంచుల్లో కలిపి దాదాపు 340 పుచ్చకాయలు ఉన్నాయి. అవి ఒక్కోటి 15 కేజీల బరువున్నాయి. వాటిని రెండురోజుల క్రితమే తెచ్చాడట. చాలా తాజాగా ఉన్నాయి.” అని చెప్పాడు.

కిరణ్ ఆ జవాబు విని తనకూ మహేష్కి గల తేడాను గుర్తించాడు. ఇక రిజైన్ చేయకుండా మహేష్నుంచి మరెన్నో విషయాలు నేర్చుకోవాలనుకున్నాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment