మంగలికి బ్రాహ్మణత్వం | Famous Akbar Birbal Kathalu in Telugu

Famous Akbar Birbal Kathalu in Telugu

మంగలికి బ్రాహ్మణత్వం Famous Akbar Birbal Kathalu in Telugu: అక్బరాదుషాకు తన మంగలిపైన, అతని పనితనంపైనా అపారమైన అభిమానం కలిగింది. నీకేంకావాలో కోరుకోమన్నాడు పాదుషా. జహాపనా! మా మంగళ్ళను నాయీబ్రాహ్మణులంటారు. కాని నాకు బ్రాహ్మణుడిని కావాలని ఉన్నది కనికరించండి, అని కోరుకున్నాడు. అక్బర్ వేదవిధులైన బ్రాహ్మణులను పిలిపించి, ఈ నా మంగలిని మీ పునీతమైన మాతాదిక్రతువుతో బ్రాహ్మణునిగా మ ర్చవలసినదని అదేశించాడు. ప్రభువుమాట మన్నించకపోతే శ్రేయస్సుకు ప్రమాదం కలుగుతుందని భయపడిన ఆ విప్రులు, ఆ మంగలిని … Read more

మసీదులోని లక్షలు నిధి | Akbar Birbal Telugu Short Stories for Kids

Akbar Birbal Telugu Short Stories for Kids

మసీదులోని లక్షలు నిధి Akbar Birbal Telugu Short Stories for Kids: ఒకనాడొక తల్లికొడుకు పాదుషా వారివద్దకు వచ్చి మసీదును కూలగొట్టి త్రవ్వడానికి అనుమతించవలసినదని కోరుకున్నారు. యేమిటి మీకీ విపరీత కోరిక. పవిత్రమైన మసీదును కూలగొట్టాలన్న ఆలోచన మీకెందుకు కలిగిందని ఆ తల్లీ కొడుకుల్ని అక్బరాదుషా గద్దిస్తూ అడిగాడు. జహాపనా! ఆ మసీదులో నాలుగులక్షల రొఖాన్ని పాతిపెట్టితిననీ. దానినితీసుకుని సుఖంగా జీవించవలసిందనీ నా భర్త చనిపోతూ నాకు, నా కుమారునికివ్రాత మూలకంగా తెలియజేసాడని, మరణించిన ఆ … Read more

నమ్మకం గొప్పదా? భక్తి గొప్పదా? | Telugu Akbar Birbal Padyalu for Children

Telugu Akbar Birbal Padyalu for Children

నమ్మకం గొప్పదా? భక్తి గొప్పదా? Telugu Akbar Birbal Padyalu for Children: అక్బరుపాదుషా వారికి మనుష్యులకు నమ్మకంగొప్పదా, భక్తిగొప్పదా, అన్న సందేహం కలిగింది. సభలో బీర్బల్ని ఈ విషయమై ప్రశ్నించారు. నమ్మకమే గొప్పదని. ఎంతటి భక్తి అయినా నమ్మకంవల్ల రాణిస్తుందని భక్తి కన్నా నమ్మకమే గొప్పదన్నారు. ఈ సమాధానం పట్ల అక్బరుకు గురి కుదరలేదు. నిరూపించమన్నాడు. నెలరోజులు వ్యవధి కావాలన్నాడు బీర్బల్. కొంతకాలం తర్వాత ఒకనాడు బీర్బల్ చెప్పుల జతనొకదానిని జరీశాలువలో చుట్టపెట్టి ఊగిపొలిమేరలో పూడ్చిపెట్టాడు. … Read more

పాదుషావారు పరిచారకుడు | Akbar Birbal Vignanam Kathalu in Telugu

Akbar Birbal Vignanam Kathalu in Telugu

పాదుషావారు పరిచారకుడు Akbar Birbal Vignanam Kathalu in Telugu: అక్బరు పాదుషావారు నిద్రలేస్తూ అంతఃపుర పరిచారకుని ముఖం చూచేరు. ఆ పరిచారకుడు కూడా తెల్లవారుతూనే తొలిసారిగా పాదుషావారి ముఖం చూచేడు. ఆనాడు దర్బారునందు పాదుషావారికి అన్నియు విరుద్ద వ్యవహారములు ప్రసంగములు సంభవించినవి. యేపని సవ్యముగా సానుకులమొనర్చబడలేదు. పైగా వేటకు వెళ్ళిన పాదుషావారికి ఒక్క మృగముకూడా వేటకు చిక్కలేదు. అలసట చెందిన అక్బరు విశ్రాంతి కొరకై ఒకవటవృక్షమునీడను గుర్రమును దిగబోగా కాలికి చిన్న దెబ్బ తగిలినది. ఆరోజు … Read more

శిక్ష అమలు తప్పిన తీరు | Akbar and Birbal Small Stories in Telugu

Akbar and Birbal Small Stories in Telugu

శిక్ష అమలు తప్పిన తీరు Akbar and Birbal Small Stories in Telugu అక్బరు పాదుషా వారికి భోజనానంతరం తాంబూలం వేసుకోవడం అలవాటుండేది. ఇందు నిమిత్తం పాదుషావారికి ఆకు, సున్నం, వక్క, సుగంధద్రవ్యాలు సమపాళ్ళలో అమర్చిఅందించే నిమిత్తం ఒక నౌకరుండేవాడు. అతడుకూడా ఎంతో జాగ్రత్తగా తాంబూలాన్ని తయారు చేసి అక్బరువారికి అందిస్తుండేవాడు. అతనికి అంతఃపురంలోని ఒక చెలికత్తె పరిచయమయ్యింది. వాళ్ళిద్దరు అక్బరువారి అనుమతితో పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకనాడు నౌకరు పాదుషా వారికి తాంబూలం సిద్ధం చేస్తుండగా, … Read more

ప్రతిపువ్వు | Telugu Kathalu – Akbar Birbal Stories for Kids

Telugu Kathalu - Akbar Birbal Stories for Kids

ప్రతిపువ్వు Telugu Kathalu – Akbar Birbal Stories for Kids: పువ్వులలో యే పువ్వుగొప్పదో తెల్పవలసినదని అక్బరు పాదుషా ఒకనాడు సభాసదులను ప్రశ్నించెను. గులాబీ అని కొందరు – మల్లె అని కొందరు. సంపెంగ అని కొందరు ఇలా తలా ఒక విధంగా వర్ణించారు. నువ్వేమంటావు బీర్బల్ అని అక్బరువారు బీర్బల్ను ప్రశ్నించారు. “జహాపన! మన సభికులు చెబుతున్నట్టు యే పువ్వుకు ఆ పువ్వేగొప్పది. కాని అవన్నీ అలంకరణకు, వినియోగానికి గొప్పగా ఉపయోగపడుతున్న పువ్వులే. కాదనను, … Read more

మనిషికన్నా కుక్కమిన్న | Telugu Stories of Akbar and Birbal with Lessons

Telugu Stories of Akbar and Birbal with Lessons

మనిషికన్నా కుక్కమిన్న Telugu Stories of Akbar and Birbal with Lessons: అక్బరుపాదుషావారు సభాసదులను ఉద్దేశించి “సభికులారా! విశ్వాసము అవిశ్వాసము అంటుంటారు. ఏమిటది?” అని ప్రశ్నించెను. చేసినది- పెట్టినది, ఇచ్చినది స్వల్పమే అయినా గుర్తు కలిగి ప్రవర్తించడం విశ్వాసం అనబడుతుంది. ఆ విధంగా కాకుండా, ఇంకా ఇచ్చేరు కాదు, అని చేసిన మేలును మరచిపోయి ప్రవర్తించడం అవిశ్వాసం అనబడుతుంది” అని వివరించాడు బీర్బల్. ‘అందుకు ఇందుకు చెప్పుకోదగ్గ వారెవరైనా ఉన్నారా?’ అని ప్రశ్నించాడు అక్బరు. లేకేం … Read more

గాలిమేడలు | Akbar and Birbal Short Stories in Telugu

Akbar and Birbal Short Stories in Telugu

గాలిమేడలు Akbar and Birbal Short Stories in Telugu: ఒకరోజున అక్బర్, బీర్బల్ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ మాటలలో గాలిమేడల ప్రసక్తి వచ్చింది. “బీర్బల్! గాలిమేడలు అంటుంటారు. అవి ఎలా ఉంటాయి. వాటిని కట్టడానికి ఎంత ఖర్చవుతుంది” అని ప్రశ్నించేడు. అక్బరాదుషా! “జహాపనా! గాలిమేడలు కట్టడం అందరికి సాధ్యపడే పనికాదు. కొందరికీ గాలిమేడలు కట్టడంలో ప్రావీణ్యత ఉంటుంది. సర్వసాధారణంగా గాలిమేడలు కట్టేవారిని గుర్తించడం కూడా కష్టం” అన్నాడు బీర్బల్. ఆ మాటలకు అక్బరాదుషా తనకు … Read more

వంకాయవంటి కూర | Akbar Birbal Neethi Kathalu in Telugu

Akbar Birbal Neethi Kathalu in Telugu

వంకాయవంటి కూర Akbar Birbal Neethi Kathalu in Telugu: ఒకప్పుడు అక్బరాపాదుషావారి వంటవాడు లేతవంకాయలతో మషాలా పెట్టి గుత్తివంకాయకూర చేసేడు. అది తిన్న పాదుషావారు. దాని రుచికి పరవశించి పోయేరు. తాను తిన్న వంకాయకూరను గురించి బీర్బల్క వర్ణించి, వర్ణించి, మరీ చెప్పాడు. వంకాయవంటిది మరిలేదయ్యా అని వంకాయను ప్రశంసించాడు పాదుషావారు. నిత్యం ఆ కూరను వంటకాలలో మాకు చేసి వడ్డించమని చెప్పేరు. అంతబాగున్న కూరను నేనింతవరకు తినలేదు. రేపు నువ్వుకూడా వచ్చి మాతోపాటు వంకాయ కూరను రుచి చూడవలసినదన్నాడు. ఆ మాటలకు బీర్బల్ పాదుషా వారిని ప్రశంసిస్తూ. జహాపనా! వంకాయ కూరగాయలలో సామ్రాట్టు అందువల్లనే “అల్లా” దానినెత్తిన టోపీ పెట్టి గౌరవించాడు” అన్నాడు. అక్బరు వారం పదిరోజుల పాటుపంకాయ కూరతోనే భోజనం చేయడం. వంటవాడు తన పనితనానికి పాదుషావారు సంతృప్తిని పొందుతుండడంతో, మరింత జాగ్రత్తగా, మరింత రుచికరంగా వంకాయకూర రకరకాలుగా వండి పాదుషావారికి వడ్డిస్తుండేవాడు. అలా పది పన్నెండు రోజులు గడిచేసరికి పాదుషావారికి దురదలు సంభవించాయి. వైద్యులను పిలిపించి మందు ఇమ్మని, కారణం యేమై ఉంటుందన్నారు. రోజూ ఆహారంలో వంకాయకూరను జతపర్చుకుని తినడమే కారణమన్నారు. అక్బరు, బీర్బల్నుపిలిపించి వంకాయ సామ్రాట్టు కనుకనే అల్లాదానికి టోపీ పెట్టి మన్నించేడన్నావు. అది దుష్టమైన కాయగూరని వైద్యులు చెప్పారు. ఇప్పుడేమంటావు. అన్నారు. అల్లాపెట్టిన టోపీతో విర్రవీగుతూ శృతిమించి ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నందువల్లనే అల్లా దాని నెత్తిన మేకును దిగవేశాడని ముచ్చికను వర్ణించాడు. నిన్న మంచిదన్నావు. ఇప్పుడు చెడ్డదంటూ నీ మాటను సమర్ధించుకుంటున్నావు యేమిటి అని అక్బరు బీర్బల్ను ప్రశ్నించాడు. “ప్రభూ! యధారాజా తధాప్రజా! ప్రభూ! అభిమతాన్ని మన్నించడం పౌరధర్మం. మీరు బాగుందన్నప్పుడు నేనూ బాగుందనే అన్నాను. బాగోలేదనడంతో బాగులేదనక తప్పలేదు. మన్నించండి జహాపనా! అన్నాడు. బీర్బల్ మాటలకు అక్బర్ ఆనందించాడు.

దేముడు చేయలేని పని | Best Telugu Stories of Akbar and Birbal for Children

Best Telugu Stories of Akbar and Birbal for Children

దేముడు చేయలేని పని Best Telugu Stories of Akbar and Birbal for Children: ఒకనాటి రాత్రిపాన్పుపై పరున్న అక్బరు పాదుషా వారికి ఒక ఆలోచన కలిగింది. దేముడు సర్వసమర్థుడు ఆయన చేయలేని పనంటూఉండదు. అట్లాగుననే తానుకూడా సర్వసమర్ధుడు. తనకంటూ అసాధ్యమైన పనిలేదు. కాని సృష్టి మాత్రం తనకు అసాధ్యం. అల్లాగుననే భగవంతునకు అసాధ్యమైన పనేదయినా ఉన్నదా అని అనుమానం కలిగింది. ఎంతగా ఆలోచించినా అక్బరుకు కలిగిన ఈ శంక తీరలేదు. మర్నాడు దర్బారులో యుక్తాయుక్తంగా బీర్బల్న ప్రశ్నించేడు అక్బరు. “బీర్బల్ నేను సమస్తమైన పనులను చేయగలవాడనుగదా! మరి నావలె భగవంతుడు అన్ని పనులు చేయగలడా?” అని సగర్వంగా ప్రశ్నించేడు “చిత్తం తమరు సర్వసమర్థులు దేముడు మీకు సరిగాడు.. మీరు చేయగల పనులు కొన్ని ఆయన చేయలేడు. మీకున్న అవకాశం ఆయనకు లేదన్నాడు. తనను అధికుడ్ని చేసిపలికిన బీర్బల్ పలుకులలో తాను చేసేది. భగవంతుడు చేయలేనిది యేమిటో తోచలేదు. తాను గ్రహించలేకపోయిన విషయం వెల్లడికాకూడదన్న ఆసక్తితో బీర్బల్ నాకు మాత్రమే సాధ్యమయ్యే పనేమిటో తోచక తికమక పడుతున్న సభికుల సంశయాన్ని తీర్చు” అన్నాడు అక్బరు. చిత్తం జహాపనా! సువిశాల ప్రపంచము అంతా ఆయనదే. తమకున్న సామ్రాజ్యమంతా తమదే. తమకు ఎవరి మీదనైనా అగ్రహంవస్తే తమరు తమ రాజ్యాన్ని విడిచిమరెక్కడికైనా పొమ్మని శాసించగలరు. ఇది దేవునకు సాధ్యంకాదు – పరాయితావుకు తన జగత్తులో ఎక్కడికని పొమ్మనగలదు జహాపనా! మీరుచేయగల ఈపని దేవుడు చేయలేడు అని ప్రభువుకు జ్ఞానోదయమయ్యేలా సున్నితంగా వివరించాడు బీర్బల్.