కోపం తగ్గే మందు! | Short moral stories in Telugu

కోపం తగ్గే మందు

Short moral stories in Telugu: కృష్ణాపురం గ్రామంలో కేశవానంద అనే స్వామీజీ ఉండేవాడు. ఓ రోజు ఆయన దగ్గరకి రమణ అనే యువకుడు వచ్చాడు. . రాగానే ఆయన కాళ్లపైనపడి ‘అయ్యా! నాకు కోపం చాలా ఎక్కువ.

మాటలు కటువుగా ఉంటున్నాయి. దాంతో అందరితోనూ ఊర్లోనూ నన్ను అందరూ ద్వేషిస్తు పోట్లాడుతున్నాను. ఇంట్లోనే కాదు, న్నారు. నేనేం చేయాలి?’ అని అడి గాడు.

అప్పుడు స్వామీజీ ‘నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అసలైన పులిగోరు వేసుకోవాలి. మన పక్కనే ఉన్న అడవిలో ఓ ముసలి పులి ఉంది.

దాని దగ్గరకు వెళ్ళి నేను పంపానని చెబితే అది నిన్నేమీ చేయదు. వెళ్లి తెచ్చుకో!’ అన్నాడు. ఆ తర్వాతి ఉదయమే కేశవ అడవికె ళ్లాడు.

బక్కచిక్కిన ముసలి పులిదగ్గ రకెళ్లి స్వామీజీ పేరు చెప్పాడు. దాంతో అదేమీ చేయలేదుకానీ ‘నాకు’ వయసైపోయింది కాబట్టి వేటాడలేకపోతున్నాను.

కాబట్టి నాకు ప్రతి రోజూ ఆహారం తెచ్చిపెడితే… గోరు ఇస్తాను!’ అని చెప్పింది. అప్పటి నుంచీ కేశవ ప్రతిరోజూ దానికి మాంసం, చేపలు తీసుకుపోవడం మొదలుపెట్టాడు.

రోజంతా దానితోనే ఉండేవాడు. కళ్లు కూడా లేని, పైకి కూడా లేవలేని దాన్ని చూసి జాలిపడటం మొదలుపెట్టాడు. దాన్ని ప్రేమగా దగ్గరకి తీసుకునేవాడు.

ఓ రోజు పులి కేశవతో ‘నేను చని పోయే సమయం వచ్చింది. చనిపోయాక నా గోళ్లు తీసుకెళ్లు!’ అని చెబుతూ కన్నుమూసింది.

కేశవ దాని మరణాన్ని చూసి తట్టుకోలేక పోయాడు. స్వామీజీ దగ్గరకొచ్చి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. ‘ఒక జంతువు చనిపోయిందనే ఇంతలా ఏడుస్తున్నావు కదా!

అదే సానుభూతినీ ప్రేమనీ నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు కేశవా…! మనసులోపల ప్రేమా, జాలీ ఉంటే సరిపోదు. దాన్ని చూపాలి.

అలా చూపడం మొదలుపెడితే నీ కోపమూ తగుతుంది. నిన్ను అందరూ ప్రేమిస్తారు!’ అని చెప్పాడు. అప్పటి నుంచీ కేశవ ఎదు టివాళ్ల ఇబ్బందుల్నీ పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడటం నేర్చు కున్నాడు… అందరి బంధువు అనిపించుకున్నాడు!

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment