దున్నపోతు | Telugu Akbar Birbal Folk Tales for Children

దున్నపోతు

Telugu Akbar Birbal Folk Tales for Children

Telugu Akbar Birbal Folk Tales for Children: పాలు అక్బరాదుషావారి బీగమ్కు చాలా సుస్తీ చేసింది. వైద్యుడు వైద్యం చేస్తున్నాడు. ఆ రోజు వైద్యుడికి ఒక చిలిపి ఆలోచన కలిగింది.

ప్రభువువారి ప్రేమాభిమానాలు చూరగొన్న బీర్బలు దెబ్బతియ్యాలన్న ఆలోచన కలిగింది. అక్బరువారివద్దకు వెళ్ళి జహాపనా! బీగమ్ గారికి వైద్యంచేయడానికి దున్నపోతుపాలుకావాలి. వీటిని సంపాదించడానికి బీర్బల్ ఒక్కడే సమర్ధుడు.

కనుక వానికి చెప్పి వెంటనే పాలు తెప్పించండి అన్నాడు. హకీం మాటలుకు ముందువెనుకలు ఆలోచించకుండా బీర్బల్ను పంపించి పాలుతేవాలన్న విషయం చెప్పిన వెంటనే తీసుకురావలసినదిగా ఆదేశించాడు.

ప్రభువులచిత్తం ఏది ఎటువంటిది అన్న, ఆలోచనలేకుండా ఆజ్ఞలు చేస్తుంటారు. ఈ పాలుఎక్కడైన సాధ్యపడతాయా. ఈపాటి విషయం కూడా ఆలోచించకుండా అనువుగా ఉన్నవారి మీద ఆజ్ఞలు జారీచేసేస్తారు.

ఇప్పుడీ ఉపద్రవాన్ని దాటి నెగ్గాలి అని బీర్బల్ తలపట్టుకు కూర్చున్నాడు ఇంటివద్ద. భర్తపరిస్థితిని చూచిన బీర్బల్ భార్య సంగతితెలుసుకుని విచారించకండి. తెల్లవారేసరికి మీ సమస్యను పరిష్కరిస్తానని భర్తను ఊరడించింది.

ఆనాటి అర్ధరాత్రి చెరువు గట్టుకువెళ్ళి బీర్బల్ భార్య బట్టలు ఉతకసాగింది. ఆ శబ్దం విన్న అక్బరు “ఎవరావిడ. ఇలాఅర్ధరాత్రి బట్టలుతుకుతున్నది. ఎందువల్ల? తెలుసుకురమ్మని” నౌకర్ని పంపించాడు.

ఆ నౌకరు వెళ్ళివచ్చి “జహాపనా! ఆమె భర్త ప్రసవించేడట అతని బట్టలు ఉతుకుతున్నదట” అని చెప్పాడు. “యేమిటి! భర్త ప్రసవించేడా?

ఈ వింత ఎక్కడైనా ఉందా! తెలుసుకుందామని” అక్బరు చెరువు గట్టుకు వెళ్ళి “ఏమిటమ్మా! మగవాడు ప్రసవించడమేమిటి? నువ్వు వానిబట్టలు ఉతకడ మేమిటి?”

అని ప్రశ్నించాడు. దున్నపోతు పాలివ్వగా మగవాడు ప్రసవించడంలో ఆశ్చర్యమేముంది అని బీర్బల్ భార్య ప్రశ్నించింది. అక్బరు తన పొరపాటును గ్రహించుకున్నాడు.

“అమ్మా! నువ్వు బీర్బల్ భార్యవేనా. కాకపోతే ఇంతటి చాతుర్యం మరెవరికుంటుంది. నీ భర్తకు మేము పొరపాటు పనిచెప్పాం అని క్షమించమన్నాడు. మర్నాడు సభలోజరిగిన విశేషమంతా చెప్పి క్షమార్పణ కోరుకున్నాడు అక్బర్.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment