గంట – ముసలిఎద్దు | Telugu Akbar Birbal Funny Stories for Children

గంట – ముసలిఎద్దు

Telugu Akbar Birbal Funny Stories for Children

Telugu Akbar Birbal Funny Stories for Children: అక్బరాదుషా తనపరిపాలనలో భాగంగా ఒకగంటను దర్బారుకు సమీపంలో కట్టించారు. కష్టమేదైనా కలిగినవారు ఆ గంటను మ్రోగిస్తే పాదుషావారు వచ్చి

వారికి కలిగిన కష్టనష్టాలను విచారించి తగిన న్యాయం సమకూర్చుతుండడం పరిపాటి. ప్రజలు దానిని “న్యాయగంట” అని ప్రశంసిస్తుంటారు.

ఒకనాడు ఒక ముసలిఎద్దు ఆ గంటవద్దకు వచ్చి తనకొమ్ములతో గంటకున్న త్రాటిని చుట్టబెట్టిలాగుతూ గంటను మ్రోగించసాగింది.

అక్బరుపాదుషావారు వచ్చి నోరులేని ఆ జంతువు గంటను లాగుతుండడం గమనించి దానికి కలిగిన బాధయేమిటో చెప్పలేదని దానికి ఏ విధమైన తీర్పును చెప్పలేక పోయేరు.

బీర్బల్ను పిలిచి ఆ ముసలిఎద్దు ఫిర్యాదేమిటో తెలుసుకొని తగిన తీర్పును ఇమ్మనెను. బీర్బల్ ఆ ఎద్దును గంటనుండి విడివడజేసి దానివెనుక కొంతమందినౌకర్లను పంపించేడు.

అది వెళ్ళివెళ్ళి తన యజమాని ‘ ఇంటిముందు ఆగింది. దానిని చూచి యజమాని, తన్ని తరిమేసినా తిరిగి ఇది ఇక్కడకే వచ్చినదని దానిని మరల తరిమి వేయబోయెను.

అదే దాని ఫిర్యాదుకు గల కారణమని గ్రహించిన రాజభటులు రాజాజ్ఞగా వానిని వెంటనిడుకుని బీర్బల్ వద్దకు తీసుకువెళ్ళారు. ఓయీ! దానిని ఎందువలన తరిమివేయుచుంటివని ప్రశ్నించెను.

మహాశయా! ఇది ముసలిదైపోయినది. పనిపాట్లు చేయలేక పోతున్నది. దీనిని పెంచుట వృధాదండుగ అని ఊరిలోనికి తరిమివేసాను అన్నాడు.

ఓయీ! అది వయసున్నప్పుడు ఎంతో కష్టపడి పనులు చేసింది. ఇప్పుడు ముసలిదైపోయిన దీనికి తిండి పెట్టకుండుట నీకు తగునా? అన్నాడు బీర్బల్.

మహాశయా! అక్కరకు ఉపయోగపడని దీనికి అలవిమాలిన ఖర్చు చేయుట నావల్లకాదు అన్నాడు. మరి నీ తల్లిదండ్రులు నిన్ను పెంచి పెద్దజేసి, నీ ఇంటిలో వృద్ధులై ఉన్నారుగదా.

వారినికూడా తరిమివేయుదువా? అని అడిగాడు. వాళ్ళు నాకు జన్మనిచ్చి, నాకై శ్రమించిన వారినెట్లు తరిమివేయగలనని యజమాని అనగా.

నీ తల్లిదండ్రులవలె నిన్ను పెంపొందజేసిన ఆ ఎద్దును కూడా పోషించుట నీ విధి అని భోధించి ఎద్దును రక్షించెను. మూగజీవికి న్యాయము సమకూర్చిన బీర్బలు అక్బరువారు తగురీతిగా సత్కరించెను.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment