అరచేతిలో వెంట్రుకలు | Telugu Akbar Birbal Moral Stories for Kids

అరచేతిలో వెంట్రుకలు

Akbar and Birbal stories, Akbar and Birbal short stories, Akbar and Birbal tales, Akbar Birbal short stories, Akbar Birbal tales, Akbar and Birbal stories in English, Akbar and Birbal stories in Hindi, Akbar Birbal short stories in English, Akbar and Birbal short stories in English, Birbal stories, Birbal tales, Short stories of Akbar and Birbal in Hindi, Small story of Akbar and Birbal in English

Telugu Akbar Birbal Moral Stories for Kids: కాలం గడచిపోతున్నది. అక్బర్ – బీర్బల్లల సాన్నిహిత్యం మరింతగా పెరిగింది. బీర్బల్ సమయోచిత విజ్ఞానానికి, సామరస్య పూర్వకమైన విధానానికి అక్బర్ ఎంతగానో సంతృప్తి చెందుతుండేవాడు.

ఒకనాడు పాదుషావారికి బీర్బల్తో హాస్యమాడాలనిపించింది. నిండు సభలో బీర్బల్ను ఉద్దేశించి “బీర్బల్ మాకొక సందేహం అది నువ్వే తీర్చగలవని నా విశ్వాసం” అన్నాడు.

“ప్రభువులకు సందేహమా, అది ఈ సామాన్య విదూషకుడు తీర్చడమా? అదేమిటో శలవియ్యండి జహాపనా. నాకు తోచిన మేరకు మీ సందేహాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తా” నన్నాడు.

మరేంలేదు. మనందరకు తెలుసున్న విషయమే అది ఎందువల్ల జరుగుతున్నది తెలియక నిన్నడుగుతున్నాను. అన్న పాదుషాను విషయం తెలియజెప్పవలసిందని అడిగాడు బీర్బల్.

ఏమున్నది. మన శరీరము అంతటా వెంట్రుకలు కొంతగాక కొంతయినా ఉన్నాయి. కాని నా అరచేతుల్లో ఎందువల్ల వెంట్రుకలు లేవన్నది మా సంశయము అన్నాడు.

“ఏమున్నది ప్రభూ! మీరుచేసే దానధర్మాల వల్ల తమ అరచేతులలో వెంట్రుకలు మొలవడం లేదు”అన్నాడు. యుక్తీయుక్తమైన జవాబుకు ఆనందించిన అక్బరుకు బీర్బల్న తికమక పెట్టాలనిపించి “మరి నీ అరచేతిలో ఎందుకు మొలవలేదని” ప్రశ్నించాడు.

“ఏమున్నది ప్రభూ మీరిచ్చే కానుకలు, ధర్మాలు అందుకోవడంలో అరచేతులు అరిగిపోయి వెంట్రుకలు మొలవడం వీలుగాక అట్లాగే ఉండిపోయా” యన్నాడు. ఆ సమాధానాలకు పాదుషా – సభికులు ఎంతగానో ఆనందించి బీర్బల్ జ్ఞానాన్ని ఎంతగానో ప్రశంశించారు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment