నమ్మకం గొప్పదా? భక్తి గొప్పదా? | Telugu Akbar Birbal Padyalu for Children

నమ్మకం గొప్పదా? భక్తి గొప్పదా?

Akbar and Birbal stories, Akbar and Birbal short stories, Akbar and Birbal tales, Akbar Birbal short stories, Akbar Birbal tales, Akbar and Birbal stories in English, Akbar and Birbal stories in Hindi, Akbar Birbal short stories in English, Akbar and Birbal short stories in English, Birbal stories, Birbal tales, Short stories of Akbar and Birbal in Hindi, Small story of Akbar and Birbal in English

Telugu Akbar Birbal Padyalu for Children: అక్బరుపాదుషా వారికి మనుష్యులకు నమ్మకంగొప్పదా, భక్తిగొప్పదా, అన్న సందేహం కలిగింది. సభలో బీర్బల్ని ఈ విషయమై ప్రశ్నించారు. నమ్మకమే గొప్పదని.

ఎంతటి భక్తి అయినా నమ్మకంవల్ల రాణిస్తుందని భక్తి కన్నా నమ్మకమే గొప్పదన్నారు. ఈ సమాధానం పట్ల అక్బరుకు గురి కుదరలేదు. నిరూపించమన్నాడు. నెలరోజులు వ్యవధి కావాలన్నాడు బీర్బల్.

కొంతకాలం తర్వాత ఒకనాడు బీర్బల్ చెప్పుల జతనొకదానిని జరీశాలువలో చుట్టపెట్టి ఊగిపొలిమేరలో పూడ్చిపెట్టాడు.

దానిపై గోరీని కట్టించి అది ఒక సుప్రసిద్ద మౌలీదని ప్రచారం లేవదీసి నిత్యం ఆగోరీవద్దపూజలు సంకీర్తనలు జరిపించసాగాడు.

కొంతకాలానికి ఈ గోరీపట్ల ప్రజలకు భక్తి కలిగింది. క్రమక్రమంగా పౌరులు తమ కోర్కెలను నివేదించుకుని, కలుగుతున్న ఫలితాలతో నమ్మికను పెంచుకున్నారు.

ప్రజలలో పెంపొందుతున్న నమ్మకం రాజ్యం అంతటావిస్తరిల్లింది. నిత్యం తీర్ధం మాదిరి ఆ ప్రాంతం సుప్రసిద్ధమయ్యింది.

అక్బరు వారికి కూడా ఈ సంగతి తెలిసింది. ఆ గోరీని చూడాలని ఆసక్తి కలిగి మందీ మార్బలంతో గోరీవద్దకు చేరుకున్నాడు. ప్రజలతాలూకు అపారమైన భక్తిని చూచి అక్బరుకు సైతం నమ్మకం కలిగి ఆ గోరీకి నమస్కరించుకున్నాడు.

బీర్బల్ మాత్రం దూరంగా నిలబడి ఇదంతా చూస్తుండడం గమనించిన అక్బరు వానిని పిలిచి యేమయ్యా నువ్విలా తటస్థంగా ఉన్నావేమిటి? అని ప్రశ్నించాడు.

నువ్వుకూడా మ్రొక్కుకో అని సలహా ఇస్తున్న సమయంలో ఒక నౌకరు వచ్చి జహాపనా! ఉదయపూర్ రాజ్యం వశమయ్యింది. అని వివరించాడు అక్బరు ఆనందించి చూసేవా బీర్బల్ ఈ గోరీ మహాత్మ్యము అన్నాడు.

జహాపనా! తమరీగోరీకి మ్రొక్కినందువల్ల ఉదయపూర్ జయం సిద్ధించలేదు. అంతకుముందే జయం ప్రాప్తించింది. కాని నమ్మకం యొక్క గొప్పతనంవల్ల ఇది మీకు గోరీపట్ల గల భక్తి వలన సిద్ధించింది అని అనుకుంటున్నారు.

చూడండి. అంటూ గోరిని పడగొట్టించి అందులోగల శాలువాలో కట్టబడి ఉన్న చెప్పులను చూపించి నమ్మకం యొక్క గొప్పదనాన్ని నిరూపించాడు బీర్బల్. అతనియొక్క యుక్తాయుక్తచర్యకు అక్బరు ఎంతగానో ఆనందించాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment