బుజ్జిమేక – పందిపిల్ల | Telugu Balamitra Kathalu

బుజ్జిమేక – పందిపిల్ల

Telugu Balamitra Kathalu: ఒక రైతు కొన్ని మేకలను, కొని పందులను పెంచేవాడు. వాటిలో ఒక బుజ్జి మేక, ఒక చిన్న పందిపిల్ల ఉండేవి. బుజ్జిమేకను వాళ్ళమ్మ ఎప్పుడూ చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది.

పందిపిల్లేమో వాళ్ళమ్మతో బాటు బురదలో తిరిగేది. దాని ఒంటి నిండా బురద అంటుకునేది. పందిపిల్ల ఎదురుపడగానే బుజ్జిమేక ముక్కు మూసుకుంటూ “ఛీ… నువ్వు నా దగ్గరకు రాకు. కంపు.

అవతలికి పో” అని చీదరించుకునేది. పందిపిల్లకేమో ఆడుకోవడానికి స్నేహితులు లేరు. మేక పిల్లతో ఆడు కుందామంటే అదెప్పుడూ పందిపిల్లను అసహ్యించుకునేది. “అమ్మా నాకూ స్నానం చేయిం చవే.

ఇలా ఉంటే నాతో మేకపిల్ల ఆడుకో వట్లేదు” అని తల్లితో అంది పందిపిల్ల. “చూడు బంగారం, మనం మన లాగే ఉంటాం. ఇంకోలా ఉండటం. మనకు కుదరదు.

మన శరీరానికి చెమ టపట్టే లక్షణం లేదు. అందుకే ఎప్పుడూ ఒంటి తడుపుకుంటూ తల్లి వివరించి మ ఉండాలి.” పందిపిల్లకు ఇదంతా అర్ధం చేసు కునే వయసులేదు.

కాస్సేపు వాళ్ళ మ్మతో గునిసింది. అమ్మ దాన్ని ఎంతో సముదాయించింది. ఒకరోజు పందిపిల్ల ఒకచోట, మేక పిల్ల ఒకచోట ఆడుకుంటున్నాయి.

ఇంతలో దూరంగా ఉన్న కొండల మీదుండే నక్క ఒకటి ఎలా పసికట్టిందో. మేకపిల్లని పట్టుకుందామని అటువైపు వచ్చింది. మేకపిల్ల ఒంటరిగా ఉండ టంతో ఆ నక్కకి మరింత వీలు చిక్కినట్టు యింది.

నక్కి నక్కి వస్తున్న నక్కను చూసింది పంది పిల. “ఏయ్ పారిపో త్వరగా పారిపో… నక్కొస్తోంది..” అంటూ గట్టిగా కేకలు వేయడమే కాకుండా మేకపిల్ల పైకి దూకబోతున్న నక్కకి అడ్డు వెళ్ళింది.

మేకపిల్లకు తగలాల్సిన దెబ్బ పందిపిల్లకు తగిలింది. ఈలోగా పంది పిల్ల అరుపు విన్న రైతు పరుగెత్తుకుని వచ్చాడు. అతన్ని చూడగానే నక్క పారిపోయింది. పందిపిల్ల గాయానికి మందువేసి బాగు చేసాడు రైతు.

ప్రాణాలు అడ్డుపెట్టి తన ప్రాణాలు కాపాడిన పందిపిల్ల పట్ల తన ప్రవర్త నను తలుచుకుని సిగ్గుపడింది బుజ్జిమేక. ఆ తరువాత రెండూ ప్రాణస్నేహి తులయ్యాయి.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment