నిజమైన స్నేహితులు | Telugu children’s literature

నిజమైన స్నేహితులు

Telugu children’s literature: శ్రీ కృష్ణుడు, సుధామ చిన్ననాటి స్నేహితులు. కృష్ణ వృద్ధి. చెంది, పెరిగి, సంపన్నుడైనాడు. కానీ సుధామ బీదతనంతో చిన్న గుడిసె లోనే ‘ తన భార్య,పిల్లలతో అవస్థలు పడుతూ జీవిస్తున్నాడు.

చివరికి పిల్లల ఆకలిని’ ‘కూడా తీర్చలేని గడ్డు పారిస్తుతులొచ్చాయి. ‘సుధామ భార్య, కృష్ణుడి వద్దకి వెళ్లి, సహాయం అడగమని సలహా “ఇచ్చింది.

మిత్రుడి దగ్గరకెళ్ళి సహాయం అడగాలంటే సుధామకి చాలా మొహమాటం, సిగ్గు అడ్డువచ్చిన, వాటిని పక్కనపెట్టి, తెగించి ద్వారకకి వేళ్ళాడు.సుధామ భార్య కృష్ణుడికి ఇష్టమైనా అటుకులు చేసి ఇచ్చింది.

ద్వారకా నగర వైభవాన్ని చూసి తెగ ఆశ్చర్య పడ్డాడు. రాజభవనం వద్ద ఉన్న ద్వారపాలకులు సుధామ చిరిగిన పంచ, అవతారం చూసి లోపలికి పంపించలేదు.

కానీ ఈ సమాచారం, అంటే, సుధామ వొచ్చి, తన ద్వారం దగ్గిర వేచిఉన్నాడన్న మాట విని కృష్ణుడు మహా ఆనందపడి, చేస్తున్న పని ఆపేసి, ఆత్రంగా పరిగెత్తి వొచ్చి, సుధామని ఆప్యాయంగా కౌగలించుకుని, లోపలికి ఆహ్వానించాడు స్వయంగా.

అంతేకాదు చాలా ప్రేమగా, గౌరవంగా, సుధామ కాళ్ళు కడిగి, తన పక్కనే కూర్చోబెట్టుకుని, చిన్ననాటి మధురస్మృతుల్ని తలుచుకుని నవ్వుకున్నారు..

అంత గొప్పగా ఉన్న రాజు, శ్రీమంతుడు అయిన శ్రీకృష్ణుడి కి తాను తెచ్చిన అటుకులు ఇవ్వవడానికి సిగ్గు పడి వెనక్కి దాచేసాడు సుధామ.

అది గమనించిన కృష్ణుడు, అడిగి మరీ చేతిలోంచి తీసుకుని, మూట విప్పి. తినసాగాడు.శ్రీకృష్ణుని ప్రేమకి, ఆదరణకి సుధామ చాలా సంతోషించాడు.. సెలవు తీసుకుని తన ఊరు వచేసాడు.

వొచ్చేసరికి అతని గుడిసె పోయి. మంచి భవనం, పిల్లలు, భార్య మంచి దుస్తులు ధరించి, కళకళ లాడుతూ కనిపించారు. తనెంత అదృష్టవంతుడో అనుకున్నాడు సుధామ.

నోరు తెరిచి. .ఏమీ చెప్పలేదు. సహాయం అడగలేదు. అయినా కృష్ణుడు తెలుసుకుని. తనకి .ఏమి కావాలో ఇచ్చేసాడు. అదే నిజమైన స్నేహమంటే.

అని అనుకుని.. . మురిసిపోయాడు…. నీతి నిజమైన స్నేహితులకి అంతస్తు తో పనిలేదు. నిన్ను హాయిగా ఉంచటమే వాళ్ళ కర్తవ్యంగా భావిస్తారు. అదే నిజమైన స్నేహం.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment