నిజాయతీ | Telugu fables for children

నిజాయతీ

Telugu fables for children: ఆ రోజు ఆఫీసుకని బయలుదేరాను. మా సందు చివర్లోనే ఓ అపార్ట్మెంట్ కడుతు న్నారు. దాని ముందుగా వెళుతూ రోడ్డుమీద ఐదువందల రూపాయల నోట్లు నాలుగు వర సగా పడుంటం చూశాను.

అక్కడే మెట్లపైన కూర్చునున్న వాచ్మాన్ ను అడిగాను నోట్లు ఎవరివని. “ఏమో..! నేను పడే వచ్చిన వి ఎవరివో అని సూత్తాండా? ” అన్నాడు.

వాటిని తీయకుంటే ఎవరిప అవుతాయని నోట్లను తీసి వాచ్మెన్ కిచ్చి ‘నువ్వు ఇక్కడే వుంటావు కదా ఈ డబ్బు పారేసుకున్నవాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే..

ఎంత డబ్బు పోయిందో వాకబు చేసి నిజంగా పోగొట్టుకున్నవారికే ఇచ్చేయి’ అని హడావిడిగా బస్టాప్కు చేరుకు న్నాను. బస్సులో కూర్చున్న నాకు ఆ డబ్బు వాచ్మాన్ కాజేసి ఎవరోవస్తే ఇచ్చానంటాడు ఇదే జరగబోయేదనీ భావించాను.

ఆఫీసునుంచి మా కాలనీలోకి చేరుకునే బ సరికి రాత్రి ఏడు గంటలు అయింది. వాచ్మెన్ ఏం చెబుతాడో చూద్దామని ఆ అపార్టుమెంట్ దగ్గరకు చేరుకున్నాను.

టేఉన్న అతను “సారూ! పొద్దుగాల కెల్లి నే ఈడనే వున్న, ఈ ముంగటికెల్లి మస్తుమంది. వస్తుండ్రు పోతుండ్రుగాని ఈ పైసల కోసం ఎవ్వరు రాలే” అని ఆ రెండు వేలు నాకు తికి ఇవ్వబోయాడు.

నేను ఒక నిర్ణ వచ్చి అతన్ని వెంటబెట్టుకుని దగ్గరలోని సాయిబాబా గుడికి తీసుకె ళ్లాను. అక్కడున్న హుండీలో అతని చేతనే ఆ రెండువేల నీ రూపాయలు వేయించాను.

గుడిబయటకు వచ్చాక నా జేబునుండి వంద రూపాయల నోటు తీసి ‘ఇది నీ నిజా ఇస్తున్నా తీసుకో’ అన్నాను. “వద్దు సారూ” అన్నాడు సిగ్గుపడుతూ. ‘తీసుకో వయ్యా!’ అంటూ అతని చేతిలో పెట్టి ఎంతో ||తృప్తిగా ఇంటివైపు కదిలాను.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment