ఆకలి కాయల పులుసు | Telugu folk tales with morals

ఆకలి కాయల పులుసు

Telugu folk tales with morals: మధురాపురి రాజ్యానికి భీమసేనుడనే రాజు ఉండేవాడు. అతడు మితిమీరిన భోజన ప్రియుడు. చాలా పెద్ద భోజనశాలను నిర్మించి అనేక దేశాల నుండి ప్రసిద్ధి చెందిన వంట వారిని నియమించాడు.

నాలుగు పూటలూ రకరకాల పంటలను తిని ఆనందించేవాడు. అయితే రోజుకో కొత్త రకం వంటకు, రుచికమైన భోజనానికి అలవాటుపడి ఆకలి అనే పదా నికి అర్ధం తెలియని రాజుకు రానురాను ఏ వంటకం రుచించకుండా పోయింది.

ఏదైనా అతిగా చేస్తే అంతేమరి! ఎంత రుచిగా వండినా వంకలు పెట్టడం మొదలు పెట్టాడు. ప్రసిద్ధిచెందిన వంటవారు పండినప్పటికీ, రుచిగా లేదని శిక్షించాడు.

అలా ఆఖరికి రాజుగారి వంటశాలలో ఒక్క వంటవాడు కూడా లేని పరిస్థితి వచ్చింది. అక్కడి ఆస్థానంలో పని చేసేవారే రాజుకు వంట చేయడా వంతులు వేసుకున్నారు.

వంటవారి కోసం రాజ్యమంతా వెతికినా భీమసేనుని తృప్తి పరచగలిగిన ఒక్క వంటవాడు కూడా దొరకలేదు. నికి ఆఖరికి పొరుగు దేశం నుండి ఒక యువకుడు రాజుగారికి వంట చేయ డానికి సిద్ధమయ్యాడు.

ఆస్థానానికి వచ్చినపుడు భీమసేనరాజు “ప్రపం చంలో నేను ఎన్నడూ రుచిచూడని వంటకాన్ని తయారు చేయగలవా?” అని అడిగాడు.

అప్పుడు ఆ యువకుడు “మహారాజా మీరెన్నడూ రుచి చూడని పులుసు ఒకటి ఉంది. దాని పేరు ఆకలి కాయల పులుసు. కాని ఆ కాయలు అడవిలో మాత్రమే కాస్తాయి.

కోసిన వెంటనే వండాలి కాబట్టి మీరు నాతో అడవికి వస్తే రుచి చూడగలరు” అన్నాడు. రాజుకు కొత్త వంటకం గురించి విని నోరూరింది.

ఆ యువకుడితో అడవికి బయలుదేరాడు. అలా పొద్దున్నే బయలు పేరిన వాళ్ళు సాయంత్రం అయినా అడవిలో నడుస్తూనే ఉన్నారు.

రాజుకు చాలా ఆకలి వేయసాగింది. “ఇంకా ఎంత దూరం?” అని అడగడం మొదలు పెట్టాడు. ఆఖరికి యువకుడు రాజుకు తెలియ కుండా తనతో తెచ్చిన ఉల్లిపాయలతో పులుసు చేసి రాజుకిచ్చాడు.

“మహారాజా, ఇదే ఆకలి కాయల పులుసు” అన్నాడు. భీమసేనుడు ఆక లితో ఉండడం వలన ఆ పులుసు చాలా రుచిం చింది.

అలాంటి పులుసు తను ఎన్నడూ తినలేద న్నాడు. అప్పుడు యువకుడు “మహారాజా! ఇది మామూలు ఉల్లిపాయలు పులుసు. మీరు ఆకలితో ఉండడం వల్ల అది మీకు రుచించింది.

ఆకలి లేని వారికి పంచభక్ష్య పరమాన్నమైనా రుచించదు. అదే ఆకలితో ఉన్న వారికి ఎలాంటి భోజనమైనా రుచిస్తుంది.” అని చెప్పాడు. రాజుకు పొరపాటు తెలిసివచ్చింది. ఆకలి విలువ తెలిసి తన అలవాట్లను మార్చుకున్నాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment