ప్రతిపువ్వు | Telugu Kathalu – Akbar Birbal Stories for Kids

ప్రతిపువ్వు

Telugu Kathalu - Akbar Birbal Stories for Kids

Telugu Kathalu – Akbar Birbal Stories for Kids: పువ్వులలో యే పువ్వుగొప్పదో తెల్పవలసినదని అక్బరు పాదుషా ఒకనాడు సభాసదులను ప్రశ్నించెను. గులాబీ అని కొందరు – మల్లె అని కొందరు. సంపెంగ అని కొందరు ఇలా తలా ఒక విధంగా వర్ణించారు.

నువ్వేమంటావు బీర్బల్ అని అక్బరువారు బీర్బల్ను ప్రశ్నించారు. “జహాపన! మన సభికులు చెబుతున్నట్టు యే పువ్వుకు ఆ పువ్వేగొప్పది. కాని అవన్నీ అలంకరణకు, వినియోగానికి గొప్పగా ఉపయోగపడుతున్న పువ్వులే.

కాదనను, అవిలేనందువల్ల మనకు అవిలేని కొరతగాని కష్టము. నష్టము యేమీఉండదు. నన్నడిగితే వీటన్నిటికన్నా గొప్ప పువ్వు ప్రత్తిపువ్వు అన్నాడు బీర్బల్. ఎందువల్ల అని ప్రశ్నించేడు అక్బర్.

ప్రతిపువ్వు వల్ల ప్రత్తి – ఆ ప్రత్తినుండి నూలు – ఆ నూలుతో వస్త్రాలు తయారౌతుంటాయి. ఆ వస్త్రాలు మనకు మానసంరక్షణకు సొగసుకు శోయగానికి తోడ్పడతాయి.

ప్రత్తిపువ్వులేకపోతే మనం అనాగరికులుగా దిగంబరులుగా ఉండిపోతే మానసంరక్షణలేని ఆటవికులుగా మసలుకోవలసి ఉండేది. ఆ సమాధానం అక్బరువారికేగాక సభాసదులందరి మన్ననలు పొందింది.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment