సత్యనాథుడి సంతృప్తి | Telugu Kathalu for Children

సత్యనాథుడి సంతృప్తి

Telugu Kathalu for Children: మల్లపురాన్ని పాలించే సత్యనాథుడికి నిత్యం ఖజానా నింపడం పైనే ధ్యాస ఉండేది. అన్ని రాజ్యాల్లో కంటే తన ఖజానా నిండుగా ఉండాలనీ, అలా ఉంటే పాలన సులభమవుతుందనీ అనుకునే వాడు విశ్వనాథుడు.

దానికి తగ్గట్లే పరిపాలన మీద కంటే పన్నులు, ఇతర ఆదాయ మార్గాలపైనే దృష్టి పెట్టేవాడు. అయినా నిత్యం నిధులు సరిపోవడం లేదని అసంతృప్తితో ఉండేవాడు.

ఒక రోజు “ఓ రాజా! ఈ ఏడు పాత్రల్లో ఉన్న వజ్రవైఢూర్యాలతో నీ ఖజానా నిండిపోతుంది. హాయిగా పాలించవచ్చు. కాని దీనిలో నీ ప్రయత్నం లేదనే అసంతృప్తి కలుగకుండా ఉండాలని ఒక పాత్రలో సగం మాత్రమే ఆభరణాలు నింపాను.

మిగిలిన సగం నువ్వు నింపి ఆ మొత్తాన్ని ఖజానాలో వేస్తే అది ఎన్ని తరాలకైనా సరిపోతుంది” అని ఒక రాజు దేవత రాజుకు కలలో ప్రత్య క్షమై చెప్పింది.

వెంటనే మేల్కొని చూశాడు. నిజంగానే అక్కడ ఆరు పాత్రల్లో నిండుగా, మరో పాత్రలో సగానికి కళ్లు మీరు మిట్లు గొలిపే ఆభరణాలు ఉన్నాయి. రాజు వెంటనే తన ఒంటిమీద ఉన్న ఆభర ణాల్ని తీసి ఏడో పాత్రలో వేశాడు.

కాని అది నిండ లేదు. రాణి నగలు తెప్పించి. అందులో వేసి చూశాడు. అయినా ప్రయోజనం లేక పోయింది. ఇలా కాదని ఖజానాలో ఉన్న ఆభర ణాల్ని ఒక్కొక్కటీ తెచ్చి పాత్రలో వేయడం మొదలు కథ పెట్టాడు.

ఎన్ని వేసినా ఆ పాత్ర నిండలేదు. ఆస్థాన మంత్రికి విషయం అర్ధమై రాజు దగ్గరగా వచ్చి “రాజా! ఆ పాత్ర ఉంది చూశారా? అది మన మనస్సులాం టిది. దానికి ఎప్పటికీ సంతృప్తి ఉండదు.

మీరు ఆ విషయం అర్ధం చేసుకుని ఈ వృధా ప్రయత్నం ఆపండి” అని చెప్పాడు. తనలో మార్పు తీసుకురావడానికే తన ఆరాధ్యదైవం ఇలా చేసి ఉంటుందని భావించిన రాజు అప్పట్నుంచి ఖజానా మీద కంటే పాలనపైనే ఎక్కువ దృష్టి పెట్టి జనరంజకంగా పాలన సాగిం చాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment