పరివర్తన | Telugu Kids Storytelling

పరివర్తన

Telugu Kids Storytelling: అనగనగా ఒక ఊరిలో శేషు అనే దొంగ ఉండే వాడు. అతను ఒక రోజు అర్ధరాత్రి దొంగతనానికి రాజమందిరానికి వెళ్లాడు. కాపలాగా ఉన్న సైని కుల కళ్లు కప్పి అంతఃపురానికి చేరుకున్నాడు.

ఆ సమయంలో రాజు, రాణి నిద్రపోకుండా మాట్లాడుకుంటున్నారు. శేషుకి వాళ్లు ఏం మాట్లాడుకుంటు న్నారో వినాలనే కుతూహలం కలిగింది.

“మహారాజా! మన కుమార్తె | వివాహం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి” అని మహారాణి అడిగింది.

“మహారాణీ! నదికి అవతల ఉండే ఊరిలో కొంత | మంది పుణ్యపురుషులు ఉన్నా రనే సంగతి మీకు తెలుసు కదా! వారు రేపు మన ఆస్థానానికి వస్తున్నారు.

వారిలో ఒకరికి మన అమ్మాయినిచ్చి వివాహం చేస్తే బాగుంటుంది. కదా” అన్నాడు రాజు. అప్పుడు రాణి, “చాలా దివ్యంగా ఉంటుంది మహారాజా” అంది.

ఇదంతా చాటునుంచి వింటున్న శేషు, “నేను కూడా వారితో కలిసిపోయి రేపు వస్తే చాలా బాగుంటుంది” అనుకు న్నాడు. అనుకున్నట్లే మరుసటి రోజు పుణ్యపురుషులతో కలిసి ఆస్థానానికి వచ్చాడు.

ముం దుగా మంత్రి వచ్చి “యువరా ణిని పెళ్లిచేసుకోవటం సమ్మత మేనా?” అని అక్కడ ఉన్న ఒక్కొక్కరినీ విడివిడిగా అడి గాడు. అందరూ తమ ఆశయా లకి వివాహం వల్ల ఆటంకం కలుగుతుంది, కాబట్టి వివాహం చేసుకోలేమని చెప్పారు.

శేషు మాత్రం మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు మంత్రి రాజు దగ్గరకు వెళ్లి “మహారాజా! వారిలో ఒక్కరిని మాత్రమే మనం వివాహానికి ఒప్పించగలం” అని చెప్పాడు.

మహారాజే అప్పుడు స్వయంగా శేషు దగ్గరకు వచ్చి “మహానుభావా ! మీలాంటి వారితోనే మా కుమార్తె వివాహం జరిపించాలని మా కోరిక.

దయచేసి ఈ వివా హానికి అంగీకరించండి” అని కోరాడు. మహారాజు చూపిస్తున్న మర్యాద శేషుకి ఆనందాన్ని కలిగించింది. ‘మంచివాడిగా నటిస్తేనే ఇంత ఆనందంగా ఉంది.

నిజంగా మంచివాడిగా మారితే ఎంత బాగుంటుందో’ అనుకు న్నాడు. ఆ క్షణం నుంచే శేషులో పరివర్తన ప్రారంభమయింది. ‘మోసం చేసి యువరాణిని పెళ్లి చేసుకోవడం చాలా తప్పు’ అని భావించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

ఆ తరవాత దొంగతనాలు మానేసి ప్రజలందరికీ ఉపయోగ పడే మంచిపనులు చేయటం ప్రారంభించాడు. అనతికాలంలోనే ఆ ప్రాంతంలో మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment