పని మనిషి | Telugu moral stories blog for kids

పని మనిషి

Telugu moral stories blog for kids: “అమ్మా! మీకు పనిమనిషి కావాలని ప్రక్కవీధిలో చెప్పారు. అందుకే వచ్చాను. నేను బాగా పని చేస్తాను” అన్నది అలివేలు ఎంతో ఆస్తిపాస్తులున్న అనసూయమ్మతో. “నీ గురించి తెలియకుండా నిన్ను ఎలా పనిలోకి పెట్టుకొనేది.

సరే ముందు ఈ బట్టలు ఉతికి ఆరేసిరా తరువాత నీతో మాట్లాడుతాను” అన్నది అనసూయమ్మ. అలువేలు బట్టలు తీసుకుని సబ్బు నీళ్ళతో నానపెడుతుండగా, ఓ చొక్కా జేబులో ఐదు వందులు రూపాయల నోటు కనిపించింది.

ఆ నోటు తీసుకుని వెనక్కి తిరిగి చూసింది హాలులో అనసూయమ్మ టి.వి. చూస్తుంది. వెంటనే అలువేలు, ఆమె వద్దకు వెళ్ళి నోటును అందించి చెప్పింది.

అనసూయమ్మ సంతోషంతో, “నీ నిజాయితికి మెచ్చుకుంటున్నాను. ఇదిగో అమ్మాయి, నేను నీ గురించి నా మనసులో అనుకున్నది వున్నది, వున్నట్టుగా చెప్పదలచుకున్నాను.

మొదట నిన్ను చూశాక నువ్వు నిజాయితిగా వుంటావో, లేదో ప్రక్క వీధిలో వారిని విచారించాలి అనుకున్నాను. కానీ ఆ అవసరం లేకుండానే నిన్ను నీవు నిరూపించుకున్నావు.

నీ నిజాయితీ నాకు నచ్చింది. అందుకని ఇక నీ గురించి చెప్పడానికి వేరే వాళ్ళు రానవసరం లేదు” అంటూ ఆమెను పనిమనిషిగా కుదుర్చుకుంది.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment