వ్యర్థ ఉపకారం | Telugu moral stories for toddlers

వ్యర్థ ఉపకారం

Telugu moral stories for toddlers: ఉపకారం చేయవలసిన వారికి చేస్తేనే సత్ఫలి తాన్ని, సంతృప్తినిస్తుం ది. అల్పులకు ఉపకారం చేసి ఫలితాన్ని ఆశించడం వలన ప్రయోజనం ఉండదు.

ఈ కొంగ కూడా అలాంటి అవమానాన్ని ఎదుర్కొన్నది. ఒకసారి ఒక తోడేలు ఒక దుప్పిని చంపి తింది. చివర్లో ఒక ఎముక ముక్క దాని గొంతుకు అడ్డుపడింది.

అది తీసుకోలేక మింగలేక నానా అవస్థా వడింది. అది క్రమేపీ ఎంతో బాధించింది. దారిన వచ్చేపోయే అంతువులన్నిటినీ ఆ తోడేలు తనకు ఈ బాధను తప్పించాలని | కోరింది.

కానీ దాని నైజం తెలిసి ఏ చిన్న జంతువూ, పక్షి కూడా దాని దగ్గరకు వెళ్ల లేదు. చివరికి ఒక కొంగ అటుగా వచ్చి దాని అవస్థ గమనిం చింది.

అయ్యో ఇది నిజంగానే బాధపడు తోందని జాలిపడింది. దాని బాధ నివృత్తి చేస్తే లబ్ది పొందవచ్చుననుకుంది. తోడేలు దగ్గరికి వెళ్లి నోరు తెరచి ఉంచ మంది.

తన పెద్దముక్కును నోటిలోకి దించి ఆ ఎముక ముక్కను తీసేసింది. తోడేలు ‘హమయ్య’ అనుకుంది. ఎంతో సాయం చేశావని కొంగను మెచ్చుకుంది. “నీరు అంత సాయం చేస్తే ఒక్క మాటతో సరిపె ట్టుకుంటావా “అంది కొంగ.

దాని ఆమా యకత్వానికి నవ్వుకుని తోడేలు, “అమాయకురాలా! నా బాధను తప్పించావు గనుక నిన్ను క్షమించి వదిలేశాను, లేకపోతే నా నోట్లోకి పెట్టిన నీ తలను ఫలహారంగా తిన లేకకాదు.

బతికిపోయావు. వెళ్లిపో… అంది. తోడేలు బుద్ధికి కొంగ ఎంతో నొచ్చుకుంది. ఇలాంటి దుష్టుడికి సాయం ఎందుకు చేశానా అనుకుంది.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment