తోట నాయక | Telugu moral stories

తోట నాయక

Telugu moral stories: చిన్ని, బంటి ఒకే బళ్లో ఆరో తరగతి చదువుతున్నారు. చిన్ని తనకు అప్పజెప్పిన ప్రతి పనీ జాగ్రత్తగా చేసేది. కానీ బంటి మాత్రం కొంచెం అల్లరి పిల్లాడు.

తన పనులు బాగానే చేసుకున్నా, పక్కవారి పనులు చెడగొట్టి సరదాపడేవాడు. ఒకరోజు బళ్లో అందరికీ తలా ఒక మొక్క ఇచ్చి వాటిని బడి తోటలో నాటాలని చెప్పారు.

పిల్లలందరూ ఎవరి మొక్కను వారు చక్కగా నాటారు. చిన్ని, బంటి కూడా వాళ్ల మొక్కలు నాటారు. బంటి తన మొక్క నాటడం అయిపోగానే చిన్ని మొక్క వైపు చూశాడు.

చిన్ని అటు తిరగ్గానే ఆ మొక్క పీకేసి ఏమీ ఎరగనట్టు నుంచున్నాడు. పాపం చిన్ని చిన్నబోయింది. అలా చేసింది బంటి అని తెలుసు.

వెంటనే మాస్టారి దగ్గరికి వెళ్లి విషయం చెప్పింది. అంతే కాదు, ఒక ఉపాయమూ చెప్పింది. మాస్టారు వచ్చి పిల్లలని వరసలో నిల్చోబెట్టి ఇలా చెప్పారు.. “పిల్లలూ, మన బడి తోటకు ఒక నాయకుణ్ని ఎన్నుకోవాలి.

మీలో అందరికన్నా వేగంగా మొక్క నాటిన బంటి అందుకు అర్హుడు. ఈ రోజు నుంచి బంటి చెప్పింది అందరూ వినాలి. బంటీ, ఎవరైనా మొక్కలకి నీళ్లు పోయకపోతే నాకు చెప్పు.

సరేనా. ఇక ఈ తోట బాధ్యత నీదే” అన్నారు. ఉన్నపళంగా మాస్టారు తనని నాయకుణ్ని చెయ్యడంతో బంటి పొంగిపోయాడు.

వెంటనే తోట పర్యవేక్షణ మొదలుపెట్టాడు. పీకేసిన చిన్ని మొక్కను తనే గబగబా నాటేసి “చిన్నీ, మొక్కని జాగ్రత్తగా చూడు” అన్నాడు.

తన పథకం పారినందుకు, మిత్రుడు మారినందుకు సంతోషించి మాస్టారి వైపు చూసి నవ్వింది చిన్ని.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment