రామయ్య దయ్యం తెలుగు నీతి కథలు
ఒకనాడు గురువుగారికి శిష్యులపై కోపం వచ్చి “ఎక్కడికయినా పోయి చావండిరా! అని కసిరి గొట్టాడు. శిష్యులు చేసేదిలేక ఊరి చివరకు పోయారు.
చెరువులో నీరు త్రాగి దాహం తీర్చుకొని తమ కర్తవ్యం గురించి ఆలోచింపసాగారు. ఇంతలో ఒక తుంటరి ‘ఏంటి పంతుళ్ళూ! యిక్కడున్నారు?
రామయ్య దయ్యమై ఊరిపొలిమేరల్లో తిరుగుచున్నాడట. యిక్కడకు రాకండి పారిపొండి’ అని భయపెట్టాడు ఆ మాటలు విన్న వెంటనే శిష్యుల మొహాల మీద నెత్తురుచుక్కలేదు.
నిశ్చేష్ప్టులయ్యారు. భయంతో అటునిటూ పరుగెత్తి మరల అక్కడికే వచ్చి “ఒరేయ్ మనమెందుకు పరుగెడుతున్నామురా!”
అని ఆలోచించుకొని కొంతసేపటికి మరల బెంబేలు పడుతూ “జ్ఞాపకమొచ్చింది రామయ్య దయ్యమై మనల్ని పట్టి బాధించడం తథ్యము” అనుకొని తలోదారి పారిపోయారు.
అలావారు పోయిపోయి పరమానందపురాన్ని చేరుకొన్నారు. అక్కడ మధూకరవృత్తిని చేబట్టి దిక్కులేని వక్షుల్లా జీవించసాగారు.
గురువుగారికింతలో మరలా శిష్యులపై ధ్యాసమళ్లింది, ‘వెర్రికుంకలు! ఎక్కడున్నారో! ఏం జేస్తున్నారో[అని బెంగపెట్టుకొని వెదకనారంభించారు.
కొంత కాలానికి శిష్యుల జాడ తెలిసింది. “రమ్మన”మని కబురు పెట్టారు. కాని దారు “రామయ్య దయ్యమై తిరుగుతున్నాడు. మమ్మల్ని చంపేస్తాడు, మేము రాము” అని బదులు పంపారు.
గురువుగారు శిష్యులను సమాధానపరచి వెనక్కి పిలిపించారు. గురువుగారు పంపిన వ్యక్తితో శిష్యలందరు తిరిగి వచ్చి “బుద్ధిగానే ఉంటామండీ! మమ్మల్ని కసరుకోకండి! మేమంతా మీ శిష్యులమేగా” అంటూ గురువుగారి వద్దనే ఉండిపోసాగారు.
రామకృష్తుడికి ఈర్ష్య
నెల్లూరు మండలంలో ఆత్మకూరి మొల్ల అనే స్త్రీ – భర్త చిన్నతనములోనే ‘ననిపోయినా మరో మనువాడడానికిష్టపడక,
పండితులనాశ్రయించీ అనేక కష్టాలకోర్చి విద్య నేర్చుకుని క్రమంగా చక్కని పాండిత్యాన్నలవరచుకుంది.
రామాయణాన్ని పద్యకావ్యంగా వ్రాసిన ‘మొల్ల’ యీమే. ఆ రామాయణాన్ని రాయలవారికంకితమివ్వాలని వచ్చింది. ఆమె మహాభక్తురాలు.
కష్టాలలో ఉన్న స్త్రీలన్నా భర్త చేత నిరాదరింపబడే యిల్లాళ్లన్నా రామకృష్ణునికి జాలి ఉన్నా – పురుషులతో సమానంగా కవిత్వం చెప్పే స్రీలన్నా మగవారి కంటె
గొప్పవారవాలనుకునే మహిళలన్నా అతనికీ మగసహజమయిన యీర్య్యే కాబోలు, మొల్ల పట్ల అసూయా, ద్వేషమూ పెంచుకుని రాయలవారామె రామాయణాన్నంకితం’
తీసుకోకుండా అద్దుపుల్లవేశాడు. ఐతే… అంకితం తీసుకోకపోయినా ఆమెకు అధికంగా ధనమిచ్చి ఆదరించారు రాయలు. తన నగరంలోనే నివాసం ఏర్పరిచారు.
నిగర్వి, తన పనులు తానే చేసుకునేదీ అయిన మొల్ల ఒకనాడు – ఒక చేత్తో కోడిపెట్టనూ, మరో చేత్తో కుక్కనూ పట్టుకుని వస్తూ ఎదురయింది.
“రూపాయిస్తాను కుక్కనిస్తావా? అర్ధరూపాయకు పెట్టనిస్తావా?” అని అడిగి – ఆమె నవమా నించాలనుకున్నాడు. కాని –
ఆమె కూడా సామాన్యురాలు కాదుకదా? రచయిత్రి కదా? అతని మాటలలోని ద్వంద్వార్థాలలోని అసభ్యతకు చెంపపెట్టు పెడుతున్నట్లు –
“నీకు నేనమ్మను” అంది బదులు చెబుతున్నట్లు. రామలింగడు ఏ ఉద్ధేశంతో అడిగినా ఆమె జవాబు చక్కగా సరిపోతుంది.
ఇక అతనేం మాట్లాడగలడు? తలవంచుకుని తన దారిన తనుపోయాడు. కాని, అతను సమయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు.