మంత్రదండం | Telugu nursery rhymes with morals

మంత్రదండం

Telugu nursery rhymes with morals: పూర్వం మాళవరాజ్యాన్ని జయభద్రుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతను మిక్కిలి సోమరి. ఎప్పుడూ చదరంగం మంత్రదండం ఆడుతూ కూర్చోవడం తప్ప రాజ్యాన్ని, ప్రజల కష్టనష్టాలను గురించి పట్టించుకునేవాడు కాదు.

రాజు సోమరి కావడంతో ప్రజలందరూ సోమరులుగానే తయారయ్యారు. ఎవ్వరూ ఏ పని చేసే వారు కాదు. దాంతో పంటలన్నీ ఎండి పోయాయి.

రాజ్యమంతటా దారిద్య్రం విలయతాండవం చేయ సాగింది. ప్రజలు ఆకలికి అల్లాడిపోతున్నారు. అప్పుడు జయభద్రుడు అర ణ్యానికి వెళ్లి భగవంతుడిని గురించి తపస్సు చేశాడు.

దేవుడు ప్రత్యక్షమై ఏమికావాలో కోరుకోమన గానే “నారాజ్యంలో దారిద్య్రం పెరిగిపోయింది. ప్రజల కష్టాలు తీర్చడానికి నాకో మంత్రదండం కావాలి” అని ప్రార్థించాడు.

వెంటనే భగవంతుడు ఒక మంత్రదండం ఇచ్చి అదృశ్యమైపో యాడు. జయభద్రుడు ఆనందంగా తిరిగివచ్చి “నా వద్ద ఒక అద్భు తమైన ఉంది.

దాంతో ఎవరు ఏమి కోరుకుంటే అవి ఇస్తాను” అని ఊరంతా చాటింపు వేయించాడు. ఊరులోని ప్రజలందరూ బిలబిలలాడుతూ రాజసౌధం వద్దకు చేరుకున్నారు.

రాజు భటులను పిలిచి “ఇంకా రాని వాళ్లు ఎవరైనా వుంటే వెళ్లి పిలు చుకు రండి” అని ఆజ్ఞాపించాడు. భటులు వెతుకుతూ వెళ్లగా ఒక చోట ఒకవ్యక్తి కట్టెలను చిన్న చిన్న మోపులుగా కడుతూ కనిపించాడు.

భటులు కళ్ళెర్ర చేసి, రాజాజ్ఞను ధిక్కరిస్తావా అంటూ అతనిని రాజు వద్దకు ఈడ్చుకుని వచ్చారు. “కోరుకున్న వాళ్లకు కోరుకున్న పన్నీ మంత్రదండంతో ఇస్తానంటే రాకుండా కట్టెలు కొట్టుకుంటున్నావెందుకు” అని రాజు ప్రశ్నించాడు.

అందుకా వ్యక్తి నవ్వి “రాజా! నా మంత్రదండం నాగొడ్డలే. దీంతో కట్టెలు కొట్టి, పొరుగూరికి తీసుకెళ్లి అమ్ముకుని, అక్కడినుంచి నాకు కావల్సిన ఆహారపదా ర్థాలు తెచ్చుకుంటాను.

నాకు హయిగా గడిచిపోతుంది. కష్టపడి పని చేయకుండా మంత్రదండం సృష్టించే సంపదలు నాకు అవ సరం లేదు” అన్నాడు వినయంగా.

అతని మాటలతో రాజు వాస్తవం గ్రహించాడు. తన చేతి లోని మంత్రదండం పైకి విసిరి వేయగానే అది మాయం అయి పోయింది.

ఆనాటి నుండి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలం దరూ తమ శక్తి మేరకు కష్టపడి పనిచేసి సిరిసంపదలతో తుల తూగసాగారు.

నీతి: కష్టించి పని చేయడాన్ని మించిన మంత్రదండం లేదు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment