విడిపోతే… ఓడిపోతారు | Telugu picture books for children

విడిపోతే… ఓడిపోతారు

Telugu picture books for children: అనగనగా ఓ అడవి. ఆ అడవిలో నాలుగు ఆవులు కలిసి మెలిసి ఉండేవి. అడవి దగ్గ రున్న గ్రామానికి వెళ్లినా కలిసి వెళ్లి వస్తుండేవి. మేతకి వెళ్లినా, నీళ్లకోసం ఏటికి వెళ్లినా కలిసే వెళుతూండేవి.

ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కాలం గడి పేవి. కొన్నాళ్లకు అవి ఉన్న ప్రాంతంలోకి ఒక పులి వచ్చింది. బలిసిన ఆవులను చూసి పులికి నోరూరింది.

కానీ వాటిని ఒక్కటిగా ఎదుర్కొ నడం కష్టమని గ్రహించింది. ఎంత ప్రయత్నించినా వాటి మధ్య విభేదాలు రావడం లేదు. పులిని దూరంగానే చూసి పోతున్నాయేగాని పలకరించడమైనా లేదు.

ఒకరోజు ఒక ఆవు గడ్డి మేయడానికి కాస్తంత దూరం వెళ్లింది. అదను చూసి దాని దగ్గరికి పులి వెళ్లింది. ఇలా ఒకదాని వెంట ఒకటి తిరుగు తూంటే ప్రయోజనం లేదు.

లోకం చాలా విశాలమైంది. ఎన్నో వింతలు ఉన్నాయి. చూసి తమలాగా ఆనందించాలని, ఇలానే ఉండిపోతే జీవితం వ్యర్థమవు తుందని ఊరిస్తూ చెప్పింది.

పైగా ఎవరి ఆకలి వారిదిగాని ఒకరి ఆకలి కోసం మరొకరు అవస్థలు పడటంలో ‘ అర్థం చెప్పింది. అది విన్న ఆ ఆవు నిజమేననుకుంది.

మర్నాటి నుంచి మిగతా మూడింటికి కాస్తంత దూరంగానే ఉంటూ వచ్చింది. దాని పరిస్థితి తెలుసుకుని వాటిలో విభేదాలు తలెత్తాయి.

అంతే! కొద్దిరోజులకు నాలుగు ఆవులూ ఐకమత్యంతో ఉండక ఎవరి దారిన వారు తినడానికి, ఏటి దగ్గరికి నీటికోసం వెళుతున్నాయి. పులి వాటి స్థితిని గమనించి ఎంతో సంతోషించింది.

తన ఎత్తు పారిందను కుంది. ఏటి దగ్గరికి వచ్చిన దాన్ని వచ్చినట్టు మీదపడి చంపి తినేయడం మొదలెట్టింది. అందుకే అన్నారు…. చెప్పుడుమాటలు వింటే ఐకమత్యం దెబ్బతి టుందని.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment