అంతర్మథనం | Telugu Short Stories with Morals

అంతర్మథనం

Telugu Short Stories with Morals: “ఒరేయ్! నాయనా, ఎక్కడికిరా ఇలా మోసుకుపోతున్నారు. ఇదేంటి? స్మశానంలో ఇలా శవాల మధ్య పారేసిపోతున్నారు.”

“ష్ మాట్లాడకు.. నువ్వు చచ్చిపోతున్నావని నీ స్నేహితుడు రాజారాం ఫోన్ చేస్తే నిజమే అనుకుని నేను అమెరికానించీ, తమ్ముడు ముంబైనించి వచ్చాం.

నువ్వు చూస్తే ఇప్పుడు ప్పిడే పోయేట్టు కనిపించడంలేదు. “ఎన్నాళ్లిలా మేం సెలవు పెట్టుకుని, మా పనులు మానుకుని నీతో వుంటాం.

ఇప్పుడు కాకపో యినా మరో రోజయినా చివరికి నువ్వు చేరుకోవా ల్సిన చోటిదే కదా” “ఒరేయ్ నాయనలారా! చలితో గడ్డకట్టుకు పోతున్నానురా.

ఒరేయ్! ఒరేయ్! నన్ను వది లిపోకండిరా” . “అబ్బబ్బ! ఏమిటండీ మీ కలవరింతలు. అసలు మీ కేమయింది?” రివెన్యూ డిపార్ట్మెం ట్ వున్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయిన వినాయకరావుని కుదిపేసింది ఆయన భార్య కాంతమ్మ.

“ఏమిటే ఇది కలా! నిజమే అనుకున్నాను. బాబోయ్..” ఆయన ఆలోచనలు గతంలోకి మళ్ళాయి. తాము నలుగురు కొడుకులూ వున్నత స్థానాల్లో వుండీ, అనాథప్రేతంగా పల్లెలో వది లేసిన అతని తల్లి గుర్తుకొచ్చింది.

చివరిదశలో తన ఇద్దరు కొడుకులూ తనని కూడా అలానే వదిలేస్తే.. అనుకున్న వినాయకరావు ఒక్కసా రిగా వణికిపోయాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment